ఏం జరుగుతోంది.? కోలీవుడ్ స్టార్ హీరోల వెనుక అసలేం జరుగుతోంది? మొన్న సూపర్ స్టార్ రజనీకాంత్.. నేడు తమిళ పవర్ స్టార్ విజయ్. రేపు మరొక స్టార్ హీరో.? ఇలా ఎంత మంది హీరోలు బాంబు టెన్షన్ తో బెబేలెత్తాలి.? ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ హీరోలందర్నీ ఈ ప్రశ్నలే వేధిస్తున్నాయి. ఈమధ్య కాలంలో స్టార్ హీరోలందరి ఇంట్లోనూ బాంబ్ వుందంటూ బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్న విషయం తెలిసిందే.
తాజాగా తమిళ స్టార్ హీరో విజయ్ ఇంట్లో కూడా బాంబు పెట్టారని, అతనికి ప్రాణ హాని ఉందని ఓ అజ్ణాత వ్యక్తి పోలీసులకి ఫోన్ చేసి చెప్పడంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు అర్ధరాత్రైనా సరే సాలగ్రామంలోని విజయ్ ఇంటికి బాంబు స్క్వాడ్‌తో చేరుకోని బాంబు కోసం విజయ్ ఇల్లంతా వెతికారు. అర్ధరాత్రంతా హై టెన్షన్ తో విజయ్ వుంటున్న ఏరియా మొత్తం బాంబ్ భయంతో బేజార్లెత్తిపోయింది. కానీ ఎక్కడా బాంబు కనిపించకపోవడంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు. మర్నాడు పోలీసులకు ఫోన్ చేసిన వ్యక్తిని కనిపెట్టి ఎంక్వయిరీ చేస్తే అతని మానసిక పరిస్థితి ఏమాత్రం బాగోలేదని తెలియడంతో అతని కుటుంబ సభ్యులకు పోలీసులు మరొకసారి ఇలాంటి పనులు చేయకుండా చూసుకోవాలని వార్నింగ్ ఇచ్చి అతడిని వాళ్ళకు అప్పగించారు.
గత నెల రజినీకాంత్ పో గార్డెన్ రెసిడెన్స్ లో కూడా ఇదేవిధంగా బాంబు పెట్టారని ఒక అజ్ణాత వ్యక్తి పోలీసులకు ఫోన్ చేసి ఆందోళన కలిగించాడు. అతడికి కూడా మానసిక పరిస్థితి బాగోలేకపోవడం వలన అలా చేశాడని పోలీసులు చేసిన ఇన్వెస్టిగేషన్ లో బయటపడటం విశేషం. ఈమధ్యకాలంలో వరుసగా కోలీవుడ్ లోని ఇద్దరు అగ్ర హీరోలకు ఇలాంటి బాంబ్ బెదిరింపు కాల్స్ రావడంతో మిగతా హీరోలు బెంబేలెత్తి పోతున్నారు. అంతేకాకుండా కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత కాలంలో హీరోలంతా ఇళ్లలో ఉన్న సమయంలో ఇలాంటి ఫోన్ కాల్స్ మరింత ఆందోళనను కలిగిస్తున్నాయి. అసలు కోలీవుడ్ లో ఏం జరుగుతుందో అర్ధం కాని పరిస్థితి ఎదురవుతోంది. మరో వైపు భారత్, చైనాల మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో భారత జవాన్లపై కాల్పులకు తెగబడుతోన్న క్రమంలో ఇలాంటి బెదిరింపు ఫోన్ కాల్స్ ని టేకిటీజీగా తీసుకోవడానికి వీల్లేదని కోలీవుడ్ స్టార్స్ మండిపడుతున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…