Categories: FeaturedMovie News

సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ పై ప్రణయ్ తండ్రి కేసు..! స్పందించిన అర్జివి..!

తెలంగాణలో సంచలనం సృష్టించిన అమృత, ప్రణయ్, మారుతీ రావుల సంఘటనపై కన్నేసిన వర్మ.. ఆ కథ ఆధారంగా ‘మ ర్డ ర్’ పేరుతో సినిమా తీస్తున్నట్లు ప్రకటించి ఫాదర్స్ డే సందర్భంగా వర్మ తన సినిమాకు సంబంధించిన పోస్టర్‌ను రిలీజ్ చేసి ‘కుటుంబ కథా చిత్రమ్’ అనే ట్యాగ్ లైన్‌తో ప్రేక్షకుల ముందుకొస్తున్నట్లు సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ ప్రకటన చూసిన నెటిజన్లందరికీ
వివాదాలకు కేంద్ర బిందువుగా ఉంటూ సంచలనాలు సృష్టించడంలో వర్మను మించిన వ్యక్తి మరొకరు లేడని అర్ధమైంది. అయితే తాజాగా వర్మ సినిమానుద్దేశించి ప్రణయ్ తండ్రి బాలస్వామి “మ ర్డ ర్” సినిమా కోసం ప్రణయ్‌, అమృత, మారుతీ రావు ఫొటోలను వాడారని, ఈ చిత్రం తన కుమారుడి హత్యా కేసును ప్రభావితం చేసే అవకాశముందని నల్గొండ ఎస్సి, ఎస్టీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఈ పిటిషన్ ను స్వీకరించిన న్యాయస్థానం వర్మ “మ ర్డ ర్” చిత్రం షూటింగ్ ను నిలిపి వేయాలనే డిమాండ్‌ను తోసి పుచ్చింది. బాధితుల అనుమతి లేకుండా “మ ర్డ ర్” లాంటి పేరుతో ఇలాంటి సినిమాను రూపొందించడం కరెక్ట్ కాదని బాలస్వామి తరఫున లాయర్ వాదించారు. దాంతో రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదు చేయాలని ఎస్సి, ఎస్టీ కోర్టు పోలీసులను ఆదేశించింది.

తాజాగా ఈ వివాదంపై స్పందించిన వర్మ తన ట్విట్టర్ ఖాతాలో షాకింగ్ రిప్లై ఇచ్చారు. ”నా సినిమాపై కేసు నమోదైన సందర్భంగా మరోసారి చెబుతున్నాను. “మ ర్డ ర్” మూవీ కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిస్తున్నాను తప్ప ఈ చిత్రంలోని పాత్రలన్నీ కేవలం కల్పితాలు. ఓ తండ్రి తన కూతురును అమితంగా ప్రేమంచడం వలన ఫ్యూచర్ లో ఎలాంటి తీవ్ర పరిణామాలు ఎదురవుతాయి.. అది ఎంత ప్ర‌మాద‌కరమో తెలిపే విధంగా అమృత‌, మారుతీరావుల క‌థ‌తో రూపొందించ‌బోతున్న ఈ చిత్రం ప్రేక్షకుల హృద‌యాల్ని క‌దిలిస్తుంది. అలాగే ఏ ఒక్క కుల ప్రస్తావనను ఈ సినిమాలో తీసుకురాలేదు” అంటూ వర్మ తనదైన శైలిలో ట్వీట్ చేయడంతో ఇప్పుడు ఈ టాపిక్ సోషల్ మీడియాలో వైరలవుతుంది.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

6 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago