తెలంగాణలో సంచలనం సృష్టించిన అమృత, ప్రణయ్, మారుతీ రావుల సంఘటనపై కన్నేసిన వర్మ.. ఆ కథ ఆధారంగా ‘మ ర్డ ర్’ పేరుతో సినిమా తీస్తున్నట్లు ప్రకటించి ఫాదర్స్ డే సందర్భంగా వర్మ తన సినిమాకు సంబంధించిన పోస్టర్‌ను రిలీజ్ చేసి ‘కుటుంబ కథా చిత్రమ్’ అనే ట్యాగ్ లైన్‌తో ప్రేక్షకుల ముందుకొస్తున్నట్లు సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ ప్రకటన చూసిన నెటిజన్లందరికీ
వివాదాలకు కేంద్ర బిందువుగా ఉంటూ సంచలనాలు సృష్టించడంలో వర్మను మించిన వ్యక్తి మరొకరు లేడని అర్ధమైంది. అయితే తాజాగా వర్మ సినిమానుద్దేశించి ప్రణయ్ తండ్రి బాలస్వామి “మ ర్డ ర్” సినిమా కోసం ప్రణయ్, అమృత, మారుతీ రావు ఫొటోలను వాడారని, ఈ చిత్రం తన కుమారుడి హత్యా కేసును ప్రభావితం చేసే అవకాశముందని నల్గొండ ఎస్సి, ఎస్టీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఈ పిటిషన్ ను స్వీకరించిన న్యాయస్థానం వర్మ “మ ర్డ ర్” చిత్రం షూటింగ్ ను నిలిపి వేయాలనే డిమాండ్‌ను తోసి పుచ్చింది. బాధితుల అనుమతి లేకుండా “మ ర్డ ర్” లాంటి పేరుతో ఇలాంటి సినిమాను రూపొందించడం కరెక్ట్ కాదని బాలస్వామి తరఫున లాయర్ వాదించారు. దాంతో రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదు చేయాలని ఎస్సి, ఎస్టీ కోర్టు పోలీసులను ఆదేశించింది.

తాజాగా ఈ వివాదంపై స్పందించిన వర్మ తన ట్విట్టర్ ఖాతాలో షాకింగ్ రిప్లై ఇచ్చారు. ”నా సినిమాపై కేసు నమోదైన సందర్భంగా మరోసారి చెబుతున్నాను. “మ ర్డ ర్” మూవీ కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిస్తున్నాను తప్ప ఈ చిత్రంలోని పాత్రలన్నీ కేవలం కల్పితాలు. ఓ తండ్రి తన కూతురును అమితంగా ప్రేమంచడం వలన ఫ్యూచర్ లో ఎలాంటి తీవ్ర పరిణామాలు ఎదురవుతాయి.. అది ఎంత ప్రమాదకరమో తెలిపే విధంగా అమృత, మారుతీరావుల కథతో రూపొందించబోతున్న ఈ చిత్రం ప్రేక్షకుల హృదయాల్ని కదిలిస్తుంది. అలాగే ఏ ఒక్క కుల ప్రస్తావనను ఈ సినిమాలో తీసుకురాలేదు” అంటూ వర్మ తనదైన శైలిలో ట్వీట్ చేయడంతో ఇప్పుడు ఈ టాపిక్ సోషల్ మీడియాలో వైరలవుతుంది.



























