Tamil heros : సినిమా ఇండస్ట్రీ ఒకప్పుడు మద్రాస్ లో ఉండటం వల్ల తమిళ, తెలుగు సినిమాల బంధం విడదీయరానిది. అక్కడ సినిమాలు ఇక్కడ, ఇక్కడ సినిమాలు అక్కడ డబ్ అయి అలరించేవి. రజనీకాంత్ నుండి నేటి ధనుష్ వరకు అందరు అరవ హీరోలకి మన దగ్గర ఫ్యాన్ బేస్ ఉంది, భాషతో పనిలేదు మేము అందరిస్తామంటారు తెలుగు ప్రేక్షకులకు. అలా రజనీకాంత్, కమల్ హాసన్, విక్రమ్, అజిత్, విజయ్, సూర్య, కార్తీ, ధనుష్ ఇలా వీరందరికీ ఇక్కడ సినిమా మార్కెట్ ఉంది. అందుకే వాళ్ళు కూడా సినిమాలను ఇక్కడ నేరుగా చేసి అభిమానులను ఖుషి చేస్తుంటారు. అయితే ఆ హీరోల సక్సెస్ వెనకున్నది మాత్రం వారి లైఫ్ పార్టనర్స్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు. అయితే మరి ఆ రియల్ హీరోయిన్స్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకుందాం.
నువ్వు నేను ప్రేమ అన్న కోలీవుడ్ హీరోలు వీళ్ళే…
తమిళ హీరోలు వారి లైఫ్ పార్టనర్స్ అనగానే గుర్తొచ్చే మొదటి పెయిర్ అజిత్, షాలిని. అజిత్ అనగానే తెలుగులోనూ మంచి క్రేజ్ ఉన్న హీరో. ఇక షాలిని కూడా హీరోయిన్ గా అందరికీ సుపరిచితురాలే. వీరిద్దరు 2000 సంవత్సరంలో పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. ఇక వీరికి ఒక పాప ఒక బాబు ఉన్నారు. ఇక నెక్స్ట్ పెయిర్ అయితే సూర్య జ్యోతిక. గజినీ సినిమాతో తెలుగులో అమ్మాయిల క్రేజ్ సంపాదించుకున్న సూర్య 2006 లో హీరోయిన్ జ్యోతికాను పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక పాప బాబు ఉన్నారు. ఇక సూర్య తమ్ముడు కార్తీ కూడా రంజని అనే ఆమెను 2011లో పెళ్లి చేసుకున్నారు వీరికి ఉంయాళ్ అనే పాప ఉంది అలాగే కంధాన్ అనే బాబు ఉన్నాడు. ఇక రిసెంట్ గా సినిమాలకు గుడ్ బై చెప్పి రాజకీయ వారసత్వం తీసుకున్న ఉదయనిది స్టాలిన్ 2002లో ఫిల్మ్ డైరెక్టర్ కృతిక ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
ఇక హీరో విజయ్ కూడా ప్రేమించి జర్నలిస్ట్ అయిన శ్రీలంకన్ తమిళ అమ్మాయి అయిన సంగీత ను 1999 లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒకపాప, బాబు ఉన్నారు. ఇక సౌత్ లోనే కాకుండా బాలీవుడ్ లోనూ బాగా ఫేమ్ తెచ్చుకున్న నటుడు ధనుష్. ఈయన తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు ఐశ్వర్య ను 2002 లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి యాత్ర, లింగ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇక బిచ్చగాడు సినిమాతో ఫేమస్ అయిన హీరో విజయ్ ఆంటోనీ ప్రేమించి ఫాతిమాను 2006 లో పెళ్లి చేసుకున్నారు. వారికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ఇక డబ్బింగ్ సినిమాలతో బాగా పేరు తెచ్చుకున్న హీరో శివ కార్తికేయ 2010లో ఆర్తి ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారికి ఒక పాప, బాబు కాగా పాప ఆరాధన తండ్రితో కలిసి పాట పాడి ఫేమస్ అయింది.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…