ఓ పాఠశాల ఆవరణలో పార్కింగ్ చేసిన వాహనంలో జరిగిన ఘటన చూసి సెక్యూరిటీ గార్డ్ ఆశ్చర్యపోయాడు. అక్కడ ఏం జరిగిందంటే.. పాఠశాలకు ఎదరురుగా ఓ వాహనం పార్క్ చేసి ఉంది. దానిని తొలగించేందుకు అతడు ప్రయత్నించాడు. ఆ వాహనంలో ఒక 16 ఏళ్ల అమ్మాయితో పాటు.. ముగ్గురు అబ్బాయిలు ఉండటం చూసి షాక్ అయ్యాడు.
ఈ ఘటన తమిళనాడులోని చెన్నైలోని అరుంబాక్కంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. అరుంబాక్కంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న కోటీశ్వరన్.. పాఠశాల ఆవరణలో పార్క్ చేసిన వాహనాన్ని తరలించడానికి ప్రయత్నించాడు. ఆ తర్వాత ఆ బస్సులో నలుగురు వ్యక్తులను చూశాడు. అందులో మగ డ్రస్ లో 16 ఏళ్ల బాలికతో పాటు మరో ముగ్గరు అబ్బాయిలు ఉన్నారు. అతడిని చూసిన ముగ్గురు వ్యక్తులు అక్కడ నుంచి పారిపోయారు.
అక్కడే ఉన్న ఆ బాలికను అతడు పోలీసులకు అప్పగించాడు. విచారణ చేపట్టిన పోలీసులు ఆ యువతిది చెన్నైలోని జామ్‌బజార్ మీర్జాకిపేట్ అని తెలుసుకున్నారు. ఆమెతో పాటు మరో ముగ్గురు స్నేహితులు నిజాం, కార్తీక్, దేవ లతో కలిసి బయటకు వచ్చినట్లు పోలీసులకు ఆమె తెలిపింది. వారు ప్రైవేట్ స్కూల్ గోడ దూకి.. అక్కడ పార్క్ చేసిన బస్సులో గంజాయి తాగినట్లు విచారణలో ఆ బాలిక చెప్పింది. ఆ తర్వాత ఆ బాలిక నిద్రలోకి జారుకున్నట్లు పోలీసులు తెలిపారు.
పోలీసులు ఆ బాలిక తండ్రిని పిలిపించారు. అతడిని కూడా విచారించారు. ఆ తర్వాత జిల్లా శిశు సంక్షేమ అధికారి.. యువతిని తన తండ్రితో కలిసి పంపించారు. దీనిపై పోలీసులు.. యువతి వేధింపులకు గురైందా.. అన్న కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. పరారీలో ఉన్న వ్యక్తుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…