Categories: FeaturedMovie News

పునీత్ రాజ్ కుమార్ కు బదులు తాను చనిపోయినా బాగుండేది.. ఎమోషనల్ అయిన శరత్ కుమార్..

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ సంస్మరణ సభ బెంగుళూరు ప్యాలెస్ గ్రౌండ్స్ లో జరిగింది. ఆ గ్రౌండ్ లోనే అతడు నటించిన ఎన్నో సినిమాల వేడుకలు జరిగాయి. అదే వేడుకలో ఇలా జరుగుతుందని ఎవరూ కలలో కూడా ఊహించి ఉండరు. ఈ సభకు వచ్చిన ప్రతీ ఒక్కరూ కళ్లల్లో నీళ్లతోనే కనిపించారు. అతడి మరణం జీర్ణించుకోలేక ఎంతో మంది తమ ప్రాణాలను కోల్పోయారు. తన అంత్యక్రియలకు దాదాపు 25లక్షల మందికి పైగా హాజరయ్యారు.

దానిని బట్టే అర్థం అవుతుంది.. అతడంటే.. ఎంతమందికి ప్రేమ ఉందో. ఈయన మరణించి 20 రోజులు అవుతున్నా కూడా ఇప్పటికీ అతడిని మరిచిపోలేకపోతున్నారు కన్నడ ప్రజలు. ఇక ఈ సభకు మాజీ ముఖ్యమంత్రి యాడ్యూరప్ప, ప్రస్తుత సీఎం బసవరాజు బొమ్మై తో పాటు మరికొంత మంది నాయకులు కనిపించారు. కన్నడ సినీ పరిశ్రమ అంతా అక్కడే కనిపించారు. మంచు మనోజ్ కూడా ఆ సభలో కనిపించారు.

ఇక తమిళ సీనియర్ నటుడు శరత్ కుమార్ కూడా కనిపించారు. ఈ సభలో అతడు చాలా ఎమోషనల్ అయ్యాడు. రాజకుమార సినిమాలో పునీత్ రాజ్ కుమార్ తండ్రిగా నటించాడు శరత్ కుమార్. ఆ సినిమా పెద్ద హిట్ కూడా అయింది. దాంతో వాళ్లిద్దరి మధ్య బాండింగ్ పెరిగిపోయింది. పునీత్ చివరి సినిమా జేమ్స్ లో కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు శరత్ కుమార్.

అతడితో తనకున్న అనుబంధాన్ని తలచుకొని.. అతడిని బదులు తాను చనిపోయినా బాగుండేదని ఎమోషనల్ అయ్యాడు శరత్ కుమార్. 100 రోజుల ఫంక్షన్ జరిగే ఈ వేదికలో .. ఇలా శ్రద్ధాంజలి గడించడం అనేది కలలో ఊహించలేదన్నారు. తన శ్రద్దాంజలికి పునీత్ వస్తాడు అనుకున్నా గానీ.. అతడి శ్రద్ధాంజలికి తాను వస్తానని అనుకోలేదన్నారు. అతడు స్టేజీపైనే కన్నీళ్లు పెట్టుకుంటుంటే ప్రతీ ఒక్కరూ ఎమోషనల్ అయ్యారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

7 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago