General News

అడవి ఏనుగుకు చిత్రహింసలు పెట్టిన యువకులు.. వైరల్!

ప్రస్తుత కాలంలోని మనుషులలో జాలి, దయ, కరుణ అనేవి మాయమయ్యాయి. సాటి మనుషుల పట్ల,మూగ జంతువుల పట్ల ఏమాత్రం మానవత్వం లేకుండా ఎంతో విచక్షణ రహితంగా ప్రవర్తిస్తున్నారు.మనుషులతో కాకపోయినప్పటికీ నోరులేని మూగ జీవాల పట్ల ఎంతో మూర్ఖత్వంగా ప్రవర్తించి వాటిని హింసిస్తున్నారు. ఈ విధమైనటువంటి సంఘటనలు ఇది వరకు మనం ఎన్నో చూసాము. అచ్చం ఇలాంటి ఘటనే తమిళనాడులో చోటు చేసుకుంది.

తమిళనాడులోని తిరుపూర్ జిల్లాలోని తిరుమూర్తి ఆనకట్ట దగ్గర నీళ్ల కోసం వచ్చిన ఏనుగులను చూసిన స్థానిక గిరిజనులు వాటిపట్ల ఎంతో విచక్షణారహితంగా ప్రవర్తించారు.ఏనుగుల పై దాడి చేస్తూ వాటిని కర్రలతో బాధడమే కాకుండా వేట కుక్కలను వదిలి రాక్షసానందం పొందారు.

ఈ విధంగా ఈ గిరిజన యువకులు ఏనుగుల పట్ల ప్రవర్తిస్తున్న తీరును కొందరు యువకులు ఈ కొండపై నుంచి వీడియో తీశారు. ఈ వీడియోను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేయడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ వీడియో చూసిన జంతు ప్రేమికులు ఆ గిరిజన యువకులు చేసిన పనికి ఎంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారికి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యి అటవీ శాఖ అధికారుల దృష్టికి చేరడంతో వీడియో ఆధారంగా అటవీశాఖ అధికారులు ముగ్గురు గిరిజన యువకులను అదుపులోకి తీసుకున్నారు. ఈ విధంగా మూగజీవాలను హింసించినందుకుగాను వారిపై వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద వారిపై కేసు నమోదు చేశారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago