Featured

Tanikella Bharani : ఎప్పటికైనా పెద్ద రౌడీ అవ్వాలన్నది నా కోరిక… నేను నా మరదలితో సినిమాకు వెళితే లేడీస్ తిట్టారు…: తనికెళ్ళ భరణి

Tanikella Bharani : తెలుగు సినిమాకు స్క్రిప్ట్ రైటర్ గాను అలాగే విలన్ గాను కమెడియన్ గాను సహాయక పాత్రలకు అలాగే డైరెక్టర్ గాను ఇలా అన్నింటా తానేంటో నిరూపించుకుని గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి తనికెళ్ళ భరణి. ఆయన ఎన్నో సినిమాల్లో నటిస్తూనే మరోవైపు శివుడి మీద భక్తి పాటలను రాసి కొన్నింటిని పాడారు కూడా. అలా అన్నింటా తన ప్రతిభను చాటుకున్న తనికెళ్ళ భరణి గారు తన చిన్నతనం అలాగే సినిమా రంగంలోకి వెళ్ళకముందు తన జీవితం గురించి మాట్లాడారు.

రౌడీ అవ్వాలని అనుకునేవాడిని…

తనికెళ్ళ భరణి గారికి చదువు అంతగా అబ్బలేదని ఆయనే చెబుతారు. చదువు మీద ధ్యాస లేదని కేవలం సినిమాలు చూడటం స్నేహితులతో తిరగడం లాంటివి చేసేవారట. అదే సమయంలో వాళ్ళుండే పక్కన బస్తీలో గొడవలు, రౌడీలు, నరకడం వంటివి చూస్తూ పెరగడం వల్ల రౌడీలకు అందరూ భయపడుతారు అనే ఉద్దేశంతో నేనూ రౌడీ అవ్వాలని అనుకునేవాడిని అయితే అవన్నీ అయ్యేవి కాదని మళ్ళీ అర్థమైంది. ఇక అదే సమయంలో నన్ను నాటకాల వైపు మా గురువుగారు మళ్ళించారు.

అలా నా జీవితంలోకి నాటకాలు, రచన పరిచయం ఏర్పడ్డాయి అంటూ తెలిపారు. ఇక సినిమాల్లోకి వచ్చాక ‘మాతృదేవో భవ’ సినిమాలో విలన్ గా చేసినపుడు చాలా మంది ఆడవాళ్లు తిట్టారు అంటూ చెప్పారు. ఇక ‘ఆమె’ సినిమాలో మరదలిని వేధించే పాత్రలో నటించినపుడు ఒకసారి నా భార్య, నేను నా భార్య చెల్లిని తీసుకుని సినిమాకు వెళ్తే అక్కడున్న లేడీస్ అందరూ నన్ను తిట్టారు. మరదలిని వేధించానని శాపనార్తాలు పెట్టేవాళ్ళు. ఏదైనా ఊరు వెళితే అక్కడ ఆడవాళ్లు మా ఊరు ఎందుకు వచ్చాడు ఈ వెధవ అని తిట్టుకునేవాళ్ళు, సినిమాల ప్రభావం అంతలాగా ఉంటుంది అంటూ తెలిపారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago