Featured

సోనూసూద్ పేరిట ఉచిత ఆంబులెన్స్ సర్వీసులు.. ఎక్కడో తెలుసా?

కరోనా సమయంలో తన మంచి మనసుతో ఎంతోమంది నిరాశ్రయులకు సహాయం చేసి కష్టాలలో ఉన్న వారిని ఆదుకోవడంతో ఒక్కసారిగా సోను సూద్ అందరి దృష్టిలో హీరోగా నిలిచాడు. కరోనా సమయంలో సోనుసూద్ చేసిన సహాయం ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచింది. సోనూసూద్ పేరిట ఎంతో మంది ఎన్నో సేవా కార్యక్రమాలను మొదలుపెట్టారు. ఇందులో భాగంగానే సోను సూద్ పేరిట హైదరాబాద్ లో ఉచిత అంబులెన్స్ సర్వీసులు ప్రారంభించారు. పూర్తి వివరాల్లోకి వెళితే

హైదరాబాద్ ప్రజలకు ఎంతో సుపరిచితమైన ట్యాంక్ బండ్ శివ గురించి అందరికీ తెలిసిందే. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలలో నివసిస్తూ ట్యాంక్ బండ్ లో ఆత్మహత్య చేసుకున్న వారిని ప్రాణాలతో వెలికి తీయడం లో పోలీసులకు ఎంతో సహకరిస్తున్నాడు. ఇప్పటికీ దాదాపు 114 మంది ప్రాణాలను కాపాడినట్లు తెలిపారు. తనకంటూ ఉండటానికి సొంత ఇల్లు లేని శివ ఎంతో మందికి సహాయం చేయడానికి ముందు వరుసలో ఉంటాడు. ఇతనికి ఎవరైనా దాతలు సహాయం చేస్తే దానిని కూడా పేదలకు ఉపయోగిస్తున్నాడు.

ఈ తరుణం లోనే సంవత్సరం క్రితం ఒక వ్యక్తి ఇతనికి మారుతి సుజుకిని దానం చేయగా దానిని అంబులెన్స్ గా ఉపయోగిస్తూ ఎంతో మంది పేద ప్రజలకు సహాయం చేస్తున్నాడు. అయితే ఒకటే ఉండటంవల్ల ఒకేసారి ఇద్దరిని తీసుకెళ్లడానికి ఎంతో ఇబ్బందిగా ఉందని భావించిన శివ దాతల సహాయంతో తాజాగా మరొక కారు కొని దానితో ఉచిత అంబులెన్స్ సర్వీసులను ప్రారంభించాడు.

అయితే ఈ ఉచిత అంబులెన్స్ సర్వీసులకు సోను సూద్ పేరు పెట్టడం విశేషం. ఎంతోమంది ఆపదలో ఉన్నప్పుడు సోను సూద్ ఆదుకున్నారు.అతనిని స్ఫూర్తిగా తీసుకొని ఈ అంబులెన్స్ కు అతని పేరు పెట్టి అతని చేత ప్రారంభింపజేశారు. అయితే తన ఆర్థిక పరిస్థితిని తెలుసుకున్న సోనూసూద్ అతనికి సహాయం చేస్తానని, ఇల్లు కూడా కట్టిస్తానని చెప్పినట్లు శివ తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం సోను సూద్ చేత ఉచిత అంబులెన్స్ సర్వీసులను ప్రారంభించారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

అవసరానికి మించి నిద్రపోకండి… ఇవే మీ శరీరానికి వచ్చే ప్రమాదాలు!

అవసరానికి మించిన నిద్ర తీసుకోవడం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు మనిషి ఆరోగ్యానికి నిద్ర అనేది చాలా ముఖ్యమైన అంశం.…

31 seconds ago

డ్రైవర్ సుబ్రహ్మణ్యం మర్డర్ కేసులో కొత్త మలుపు… ఎమ్మెల్సీ అనంత బాబు భార్యను ఏ-2గా చేర్చిన సిట్

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎమ్మెల్సీ అనంత బాబు భార్య లక్ష్మీ…

19 minutes ago

విజయ్–రష్మిక పెళ్లికి సూపర్ సర్ప్రైజ్.. ముఖేష్ అంబానీ అందిస్తున్న అద్భుత బహుమతి!

విజయ్–రష్మిక పెళ్లి శుభకార్యం… సోషల్ మీడియా ఫైర్ ఈ నెల 26న రాజస్థాన్‌లోని ఉదయపూర్ ప్యాలెస్‌లో సౌత్ ఇండియా స్టార్…

31 minutes ago

మహేష్–రాజమౌళి ప్రాజెక్ట్‌లో మరో సూపర్ స్టార్… ‘వారణాసి’పై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి

‘వారణాసి’లో కొత్త స్టార్ ఎంట్రీ వార్తలు… పాన్ ఇండియా హీట్ పెరుగుతోంది సూపర్ స్టార్ Mahesh Babu మరియు దర్శక…

33 minutes ago

T20 World Cup 2026 : టి20 వరల్డ్‌కప్ కీలక దశలో ప్లేయింగ్ ఎలెవన్ చర్చ.. ఇప్పటికైనా సంజూకు ఒక ఛాన్స్ ఇవ్వండి..

టి20 ప్రపంచకప్ 2026లో గ్రూప్ దశ ముగింపు దశకు చేరుకుంది. ఇంకా కొన్ని మ్యాచ్‌లు మిగిలి ఉన్నప్పటికీ, ఇప్పటికే సూపర్-8కు…

36 minutes ago

హైదరాబాద్‌లో అనిరుద్ రవిచందర్ లైవ్ కాన్సర్ట్‌కు భారీ స్పందన… టికెట్ ధరలే హాట్ టాపిక్

సౌత్ ఇండియన్ మ్యూజిక్ ఇండస్ట్రీలో ప్రస్తుతం అత్యంత బిజీగా, అత్యధిక క్రేజ్‌తో దూసుకెళ్తున్న సంగీత దర్శకుడు అనిరుద్ రవిచందర్. ఆయన…

42 minutes ago