కరోనా సమయంలో తన మంచి మనసుతో ఎంతోమంది నిరాశ్రయులకు సహాయం చేసి కష్టాలలో ఉన్న వారిని ఆదుకోవడంతో ఒక్కసారిగా సోను సూద్ అందరి దృష్టిలో హీరోగా నిలిచాడు. కరోనా సమయంలో సోనుసూద్ చేసిన సహాయం ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచింది. సోనూసూద్ పేరిట ఎంతో మంది ఎన్నో సేవా కార్యక్రమాలను మొదలుపెట్టారు. ఇందులో భాగంగానే సోను సూద్ పేరిట హైదరాబాద్ లో ఉచిత అంబులెన్స్ సర్వీసులు ప్రారంభించారు. పూర్తి వివరాల్లోకి వెళితే

హైదరాబాద్ ప్రజలకు ఎంతో సుపరిచితమైన ట్యాంక్ బండ్ శివ గురించి అందరికీ తెలిసిందే. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలలో నివసిస్తూ ట్యాంక్ బండ్ లో ఆత్మహత్య చేసుకున్న వారిని ప్రాణాలతో వెలికి తీయడం లో పోలీసులకు ఎంతో సహకరిస్తున్నాడు. ఇప్పటికీ దాదాపు 114 మంది ప్రాణాలను కాపాడినట్లు తెలిపారు. తనకంటూ ఉండటానికి సొంత ఇల్లు లేని శివ ఎంతో మందికి సహాయం చేయడానికి ముందు వరుసలో ఉంటాడు. ఇతనికి ఎవరైనా దాతలు సహాయం చేస్తే దానిని కూడా పేదలకు ఉపయోగిస్తున్నాడు.

ఈ తరుణం లోనే సంవత్సరం క్రితం ఒక వ్యక్తి ఇతనికి మారుతి సుజుకిని దానం చేయగా దానిని అంబులెన్స్ గా ఉపయోగిస్తూ ఎంతో మంది పేద ప్రజలకు సహాయం చేస్తున్నాడు. అయితే ఒకటే ఉండటంవల్ల ఒకేసారి ఇద్దరిని తీసుకెళ్లడానికి ఎంతో ఇబ్బందిగా ఉందని భావించిన శివ దాతల సహాయంతో తాజాగా మరొక కారు కొని దానితో ఉచిత అంబులెన్స్ సర్వీసులను ప్రారంభించాడు.

అయితే ఈ ఉచిత అంబులెన్స్ సర్వీసులకు సోను సూద్ పేరు పెట్టడం విశేషం. ఎంతోమంది ఆపదలో ఉన్నప్పుడు సోను సూద్ ఆదుకున్నారు.అతనిని స్ఫూర్తిగా తీసుకొని ఈ అంబులెన్స్ కు అతని పేరు పెట్టి అతని చేత ప్రారంభింపజేశారు. అయితే తన ఆర్థిక పరిస్థితిని తెలుసుకున్న సోనూసూద్ అతనికి సహాయం చేస్తానని, ఇల్లు కూడా కట్టిస్తానని చెప్పినట్లు శివ తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం సోను సూద్ చేత ఉచిత అంబులెన్స్ సర్వీసులను ప్రారంభించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here