దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావు డైరెక్షన్ లో మంచు మనోజ్ హీరోగా తెరకెక్కిన ఝుమ్మంది నాదం సినిమాతో తాప్సీ తెలుగుతెరకు నటిగా పరిచయమయ్యారు. తెలుగులో తొలి సినిమాతోనే గ్లామరస్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న తాప్సీకి ప్రభాస్, రవితేజ సినిమాల్లో ఛాన్స్ రాగా ఆ సినిమాలతో తాప్సీ నటిగా మంచి పేరును సంపాదించుకున్నారు. ప్రస్తుతం బాలీవుడ్ ఆఫర్లతో తాప్సీ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.
విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తాప్సీ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉండటం గమనార్హం. తాప్సీ నటిస్తున్న ఫ్లాపైన సినిమాల్లో సైతం ఆమె నటనకు ప్రశంసలు దక్కుతున్నాయి. తెలుగులో సెకండ్ హీరోయిన్ రోల్స్ లో ఎక్కువగా చేసిన తాప్సీ బాలీవుడ్ లో ఎంచుకున్న కథలు వర్కౌట్ కావడంతో పాటు ఆమెకు మంచిపేరును సంపాదించి పెట్టాయి. మరోవైపు బాలీవుడ్ లో తాప్సీ తన రెమ్యునరేషన్ ను భారీగా పెంచేశారు.
ప్రస్తుతం తాప్సీ బాలీవుడ్ లో ఒక్కో సినిమాకు 2 కోట్ల రూపాయలకు అటూఇటుగా పారితోషికం తీసుకుంటున్నారు. బడ్జెట్ ను బట్టి కొన్ని సినిమాలకు తాప్సీ పారితోషికం తగ్గించుకోవడానికి సైతం సిద్ధపడుతూ ఉండటం గమనార్హం. ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు యాడ్స్ తో తాప్సీ బిజీగా ఉన్నారు. తాప్సీ ఏడాది ఆదాయం 40 కోట్ల రూపాయలకు అటూఇటుగా ఉంటుందని తెలుస్తోంది.
కొంతమంది టాలీవుడ్, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ల ఆదాయంతో పోలిస్తే తాప్సీ ఆదాయం ఎక్కువ మొత్తం కావడం గమనార్హం. బాలీవుడ్ స్టార్ హీరోయిన్లకు తాప్సీ గట్టి పోటీ ఇస్తుండటం గమనార్హం.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…