Jr NTR: హైదరాబాద్ లో విలాసవంతమైన ఇంటిని కొనుగోలు చేసిన తారక్… ఎన్ని కోట్లో తెలుసా?
Jr NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన RRR సినిమా ద్వారా పాన్ ఇండియా హీరోగా గుర్తింపు సంపాదించుకున్నారు.ఈ క్రమంలోనే ఈ సినిమా మంచి విజయం అందుకోవడంతో తారక్ తన తదుపరి సినిమాల వైపు దృష్టి సారించారు. ఇక ఈయన ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. ఈ విధంగా కెరీర్ పరంగా ఎన్టీఆర్ స్టార్ హీరోగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు.
ఎన్టీఆర్ వ్యక్తిగత విషయానికి వస్తే ఆయన ఎంతో లగ్జరీ జీవితాన్ని గడపడానికి ఇష్టపడతారు. ముఖ్యంగా ఖరీదైన కార్లు, వాచీలు ధరిస్తూ తన ఇష్టాఇష్టాలు బయట పెడుతుంటారు.కార్ల అంటే ఎంతో ఇష్టం ఉన్న తారక్ కార్ల కోసం ఎంతైనా ఖరీదు చేసి విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటారు.
తాజాగా ఎన్టీఆర్ హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఏరియాలో ఏదైనా బంగ్లాను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ ఇంటి కోసం తారక్ 25 కోట్లు ఖర్చు చేశారని సమాచారం. ఇక ఈ ఇంటిలో వారి అభిరుచులకు అనుగుణంగా ఇంటీరియర్ డిజైన్ చేయించుకున్నారు. ఇంటీరియర్ డిజైన్ తోపాటు ఫర్నిచర్ ఎంతో అద్భుతంగా డిజైన్ చేయించారని తెలుస్తోంది.
తారక్ రామ్ చరణ్ ఇంటికి సమీపంలోనే కొనుగోలు చేశారట. ఇక తన డ్రీం హౌస్ గా ఉన్నటువంటి ఈ ఇంటిని పూర్తిగా తన అభిరుచులకు అనుగుణంగా రూపుదిద్దుకున్నారు. ఎన్టీఆర్ కి కేవలం హైదరాబాద్ లోనే కాకుండా,బెంగళూరులో కూడా ఎంతో ఖరీదైన బంగ్లాలను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇక సినిమాల విషయానికి వస్తే కొరటాల శివతో సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించకోనుంది.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…