Tarakaratna: నందమూరి తారకరత్న మరణించడంతో ఒక్కసారిగా ఆయన కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. నందమూరి తారకరత్న మరణం తన భార్య అలేఖ్యను ఎంతగానో కృంగతీసింది. ఇక తారకరత్న మరణించడంతో అలేఖ్య రెడ్డి దుఃఖసాగరంలో మునిగిపోయింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తి ఇలా అర్ధాంతరంగా వెళ్లిపోవడంతో ఆమె దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.
ఇక తారకరత్న అంత్యక్రియల సమయంలో కూడా అలేఖ్య రెడ్డి రోదన అందరిని కంటతడి పెట్టించింది. ఈమెను ఓదార్చడం ఎవరి తరం కాలేదు. ఇలా తన భర్త ఇక రారనే చేదువార్తను దిగమింగలేక ఈమె ఏకధాటిగా కంటతడి పెట్టుకున్నారు. తారకరత్న చిన్న కర్మ సమయంలో కూడా ఈమె తన భర్తను తలుచుకొని ఎంతో కుమిలిపోయారు.
ఇక తారకరత్న మరణించడంతో అలేఖ్య రెడ్డి మొదటిసారి తన భర్త మరణం తర్వాత ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అందరి చేత కంటతడి పెట్టిస్తుంది. ఈ సందర్భంగా అలేఖ్య రెడ్డి పోస్ట్ చేస్తూ… మనం మన ప్రయాణంలో ఎన్నో పోరాటాలు చేసాం..నీ చివరి రోజుల వరకు ఫైట్ చేసావ్ కార్లలో నిద్రపోయిన రోజుల నుంచి ప్రస్తుతం వరకు మన జీవితం అంత సాఫీగా సాగలేదు.
ఈ పోరాటంలో మనం చాలా దూరం వచ్చేసాం.. నువ్వు ఒక వారియర్ నాన్న..నువ్వు మాపై చూపించినంత ప్రేమ ఇంకెవరు చూపించలేరు అంటూ తారకరత్న చేతిలో చేయి వేసి ఉన్నటువంటి ఫోటోని షేర్ చేస్తూ ఈమె ఎమోషనల్ అయ్యారు. దీంతో ఈ పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎంతోమంది అలేఖ్య తొందరగా ఈ బాధ నుంచి బయట పడాలని, భగవంతుడు ఆమెను మంచిగా చూడాలని కామెంట్లు చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…