Tarun -Priyamani: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు మోస్ట్ లవర్ బాయ్ గా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి వారిలో నటుడు తరుణ్ ఒకరు.బాల నటుడుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన తరుణ్ నువ్వే కావాలి నువ్వు లేక నేను లేను ప్రియమైన నీకు వంటి వరుస హిట్ సినిమాలతో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇలా వరుస సినిమాలు సక్సెస్ అవడంతో పెద్ద పెద్ద బ్యానర్లు ఈయన ముందు క్యూ కట్టేవి.
ఇకపోతే అప్పట్లో ఈయన ఆర్తి అగర్వాల్ తో కలిసి సినిమాలలో నటించారు. ఈ క్రమంలోనే వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే ఆర్తి అగర్వాల్ ను తన కుమారుడికి చేసుకోవడం ఇష్టం లేనటువంటి తరుణ్ తల్లి రోజా రమణి వీరి పెళ్లికి అడ్డుపడిందనీ అప్పట్లో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఇక ఆర్తి అగర్వాల్ తో బ్రేకప్ తర్వాత ఈయన ప్రియమణితో కలిసి నవ వసంతం అనే సినిమాలో నటించారు.
ఈ సినిమా ఎంతో మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఈ సినిమా సమయంలో ప్రియమణి తరుణ్ ఇద్దరూ ప్రేమలో ఉన్నారంటూ వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలు తెలిసినటువంటి తరుణ్ తల్లి సరాసరి షూటింగ్ లొకేషన్లోకి వెళ్లి ప్రియమణిని నేరుగా అడిగిందట.నువ్వు నిజంగానే నా కొడుకుతో ప్రేమలో ఉన్నావా ఉంటే చెప్పు మీ పెళ్లి చేయడానికి తాను సిద్ధమేనంటూ ఈమె తరుణ్ తో పెళ్లికి ప్రియమణిని ఒప్పించే ప్రయత్నం చేశారట.
ఇలా రోజా రమణి తరుణ్ తో పెళ్లి గురించి అడగడంతో ఒక్కసారిగా షాక్ అయిన ప్రియమణి అసలు మీరు చెప్పే వరకు మా ఇద్దరి గురించి ఇలాంటి వార్తలు వస్తున్నాయని నాకు తెలియదు అసలు ఒక సినిమాలో నటిస్తేనే ప్రేమలో పడతారా ఇవన్నీ ఒట్టి పుకార్లు మాత్రమే అంటూ ప్రియమణి కొట్టి పారేశారు. ఇలా అప్పట్లో ప్రియమణి తరుణ్ గురించి ఈ వార్తలు ఓ రేంజ్ లో వైరల్ అయ్యాయి.
తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన ఏడాది వయసున్న చిన్నారి ఆర్యాన్ష్ ప్రస్తుతం అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్నాడు. చిన్న వయసులోనే…
బెంగళూరులో మూడు నెలల క్రితం చోటుచేసుకున్న ఆరేళ్ల చిన్నారి వెన్నెల మృతి కేసు తాజాగా సంచలన మలుపు తిరిగింది. మొదట…
ఇటీవలి కాలంలో ఆహార భద్రతపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా కూరగాయలు, పండ్లలో రసాయనాల వినియోగంపై తరచూ వార్తలు వెలువడుతుండటంతో…
హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు అనారోగ్యానికి గురై చికిత్స…
ప్రపంచ వాతావరణ పరిస్థితులపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న…
తెలుగు బుల్లితెరపై ప్రసారమైన ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన పండు మాస్టర్, తన డ్యాన్స్…