ప్రస్తుతం ప్రపంచదేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మారి భారత్ లోను విస్తరిస్తుంది. ఇప్పటికీ దేశంలో 900లకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 20 వరకు కరోనా మరణాలు సంభవించాయి. ఈ నేపథ్యంలో దేశంలోని వ్యాపార దిగ్గజం టాటా ట్రస్ట్ సంస్థ కరోనా పై పోరు కోసం రూ.500 వెచ్చించనున్నట్టు టాటా ట్రస్ట్ చైర్మన్ రతన్ టాటా ట్విట్టర్ లో ప్రకటన చేసారు. “ప్రస్తుతం ప్రపంచంతో పాటు దేశం కూడా కోవిడ్-19తో తీవ్ర సంక్షభంలో ఉంది. ఈ సంక్షభంనుంచి బయటపడాలంటే సత్వర చర్యలు అవసరం. ప్రతి గంటా ఎంతో విలువైనది. జాతిమొత్తం ఈ విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటుంది. మన ముందు ఉన్న కష్టతరమైన సవాల్ ఇది. టాటా ట్రస్ట్ జాతి రక్షణకు ప్రతిజ్ఞ చేస్తుంది. ఈ కరోనా వైరస్ పోరులో అనునిత్యం శ్రమిస్తున్న వారికీ, కరోనా భాదితులకు సాయం కోసం రూ.500 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించాం.” అని రతన్ టాటా తెలిపారు.
కరోనా వైరస్ భాదితులకు సేవలందించే వైద్య సిబ్బందికి వ్యక్తిగత రక్షణ సామాగ్రి, బాధితులకు వైద్య పరికరాలు, వైరస్ ను పరీక్షించేందుకు టెస్టింగ్ కిట్లు మరియు ప్రజలకు ఈ వైరస్ పై అవగాహన కల్పించే కార్యక్రమాలను నిర్వహించడానికి ఈ మొత్తాన్ని వినియోగించనున్నారు తెలిపారు. ఈ మహమ్మారిని ఎదుర్కొనేందుకు టాటా ట్రస్ట్, టాటా సన్స్, టాటా గ్రూప్ కంపెనీలు ప్రపంచ వ్యాప్తంగా కలిసి పనిచేస్తాయని ఆయన తెలిపారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…