కడప పోలీసు పరేడ్ గ్రౌండ్లో జరిగిన 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో టీడీపీ ఎమ్మెల్యే మాధవి రెడ్డి వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారింది. వేదికపై తన కోసం కుర్చీ వేయకపోవడంపై ఆమె అలకబూని, అరగంటకు పైగా నిలబడ్డారు. చివరకు అక్కడి నుంచి వెనుదిరిగారు.
వేడుకల సందర్భంగా స్టేజిపై ముఖ్య అతిథిగా మంత్రి ఫరూక్తో పాటు కలెక్టర్ చెరుకూరి శ్రీధర్, ఎస్పీ అశోక్ కుమార్, జేసీ అతిథి సింగ్ ఆసీనులయ్యారు. ఈ వేడుకలకు ఎమ్మెల్యే మాధవి రెడ్డి ఆలస్యంగా చేరుకున్నారు. వేదికపై తనను ఆహ్వానించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆమె, జేసీ అతిథి సింగ్‌పై చిందులు తొక్కారు. జేసీని ఆమె కోపంగా చూస్తూ ఆగ్రహావేశాలు ప్రదర్శించారు.
ప్రోటోకాల్ ప్రకారం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యేలకు వేదికపై అనుమతి లేదు. అయితే, జిల్లా కలెక్టర్ శ్రీధర్ స్వయంగా ఎమ్మెల్యే మాధవి రెడ్డిని వేదికపైకి వచ్చి కూర్చోవాలని కోరారు. కానీ ఆమె ఆ ఆహ్వానాన్ని తిరస్కరించారు. తన కోసం కుర్చీ వేయకపోవడంపై నిరసనగా అరగంటకు పైగా అక్కడే నిలబడిన ఆమె, ఆ తర్వాత కార్యక్రమం నుంచి వెళ్లిపోయారు. ఎమ్మెల్యే మాధవి రెడ్డి వ్యవహరించిన తీరు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
మధుమేహం ఉన్నవారు ఏ ఆహారం తీసుకోవాలి, ఏది మానుకోవాలి అన్న సందేహం ఎప్పుడూ ఉంటుంది. ముఖ్యంగా తీపి పదార్థాల విషయంలో…
తెలుగు సినీ రంగంలో సీనియర్ నటి వరలక్ష్మి తన సినీ ప్రయాణంలో ఎదురైన అనుభవాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికరంగా…
డయాబెటిస్ ఉన్నవారు గుడ్లు తినకూడదనే అపోహ చాలా మందిలో ఉంది. కానీ వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, సరైన పరిమితిలో…
ఇంట్లో సులభంగా దొరికే కొన్ని సహజ పదార్థాలు ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి. అలాంటి వాటిలో ఒకటి తమలపాకు. సాధారణంగా…
వంటగదిలో గ్యాస్ స్టవ్ మంట సాధారణంగా నీలం రంగులో ఉండాలి. కానీ అదే మంట పసుపు రంగులో కనిపిస్తే, దాన్ని…
విశాఖపట్నం నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఓ ప్రయాణికుల విమానంలో చోటుచేసుకున్న సాంకేతిక లోపం కాసేపు ఉత్కంఠకు దారి తీసింది. ఇండిగోకు…