సాధారణంగా మన ఆర్థిక పరిభాషలో ఏదైనా మానిటరింగ్ చేయాలంటే మూడు నెలలకు ఒకసారి లేదా సంవత్సరంలో రెండు సార్లు చేస్తుంటారు. సంవత్సరంలో ఉన్న 12 నెలల్లో 4 భాగాలుగా చేసుకుంటే అందులో 3 నెలలకు క్వార్టర్ అని అంటాం. ఇలా 4 క్వార్టర్ లు అయితే 12 నెలలు పూర్తి అవుతుంది.
అదే క్వార్టర్ అనే పదాన్ని మన పల్లెటూరోల్లు కూడా వాడుతారు. అందేంటి అనుకుంటున్నారా.. అవును ఎక్కువగా వాళ్లు ఉపయోగించే.. వాడే పదం వాళ్లు మాత్రమే. అదేనండి వైన్స్ లోని వెళ్లినప్పుడు ఒక క్వార్టర్ మందు పోయండి అంటారు కదా మందుబాబులు అలా.
అయితే ఇక్కడ దీని గురించి చెప్పడానికి గల కారణం ఏంటంటే.. పిల్లలకు ధావల్ పురోహిత్ అనే ప్రొఫెసర్ ఆన్‌లైన్‌లో సీఏ క్లాసెస్ తీసుకుంటున్నాడు. అందులో భాగంగా విద్యార్థులను ఒక ప్రశ్న అడుగుతాడు.. అదేంటంటే.. క్వార్టర్ అంటే ఏమిటి.. అని అందులో ఓ స్టూడెంట్ ను అడిగాడు. వెంటనే అంత సింపుల్ ప్రశ్న వేశారేంటి సర్.. అంటూ అతడు చాట్ బాక్స్ లో ఏమాత్రం ఆలోచించకుండా 30 ఎంఎల్ అని రాశాడు.
దీంతో ప్రొఫెసర్ కు ఒక్కసారిగా కోపం తన్నుకుంటూ వచ్చింది. ఈ తాగుబోతు ఆలోచనలు ఏంటి రా బాబు అనుకుని.. అరేయ్ నాయనా.. క్వార్టర్ అంటే 30 ఎంఎల్.. 90 ఎంఎల్ కాదురా.. 3 నెలలు అని చెబుతాడు. దీంతో ఆన్ లైన్ క్లాస్ లో అందరూ తెగ నవ్వుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నెటిజన్లకు కూడా ఈ వీడియో చూసి నవ్వు ఆపుకోలేకపోతున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…