క్వార్టర్ అంటే ఏమిటో కొత్త అర్థం చెప్పిన విద్యార్థి.. వీడియో వైరల్..!

0
275

సాధారణంగా మన ఆర్థిక పరిభాషలో ఏదైనా మానిటరింగ్ చేయాలంటే మూడు నెలలకు ఒకసారి లేదా సంవత్సరంలో రెండు సార్లు చేస్తుంటారు. సంవత్సరంలో ఉన్న 12 నెలల్లో 4 భాగాలుగా చేసుకుంటే అందులో 3 నెలలకు క్వార్టర్ అని అంటాం. ఇలా 4 క్వార్టర్ లు అయితే 12 నెలలు పూర్తి అవుతుంది.

అదే క్వార్టర్ అనే పదాన్ని మన పల్లెటూరోల్లు కూడా వాడుతారు. అందేంటి అనుకుంటున్నారా.. అవును ఎక్కువగా వాళ్లు ఉపయోగించే.. వాడే పదం వాళ్లు మాత్రమే. అదేనండి వైన్స్ లోని వెళ్లినప్పుడు ఒక క్వార్టర్ మందు పోయండి అంటారు కదా మందుబాబులు అలా.

అయితే ఇక్కడ దీని గురించి చెప్పడానికి గల కారణం ఏంటంటే.. పిల్లలకు ధావ‌ల్ పురోహిత్ అనే ప్రొఫెసర్ ఆన్‌లైన్‌లో సీఏ క్లాసెస్ తీసుకుంటున్నాడు. అందులో భాగంగా విద్యార్థులను ఒక ప్రశ్న అడుగుతాడు.. అదేంటంటే.. క్వార్టర్ అంటే ఏమిటి.. అని అందులో ఓ స్టూడెంట్ ను అడిగాడు. వెంటనే అంత సింపుల్ ప్రశ్న వేశారేంటి సర్.. అంటూ అతడు చాట్ బాక్స్ లో ఏమాత్రం ఆలోచించకుండా 30 ఎంఎల్ అని రాశాడు.

దీంతో ప్రొఫెసర్ కు ఒక్కసారిగా కోపం తన్నుకుంటూ వచ్చింది. ఈ తాగుబోతు ఆలోచనలు ఏంటి రా బాబు అనుకుని.. అరేయ్ నాయనా.. క్వార్టర్ అంటే 30 ఎంఎల్.. 90 ఎంఎల్ కాదురా.. 3 నెలలు అని చెబుతాడు. దీంతో ఆన్ లైన్ క్లాస్ లో అందరూ తెగ నవ్వుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నెటిజన్లకు కూడా ఈ వీడియో చూసి నవ్వు ఆపుకోలేకపోతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here