Teja Sajja: తేజ సజ్జ పరిచయం అవసరం లేని పేరు. తాజాగా ఈయన హనుమాన్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుందో అందరికీ తెలిసిందే. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఈ సినిమా ఎంతో అద్భుతమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకుంది. అన్ని ప్రాంతాలలోనూ ఈ సినిమాకు మంచి ఆదరణ లభిస్తుంది.
ఇక ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో చిత్ర బృందం సక్సెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా హీరో తేజ ఈ సినిమా కోసం పడినటువంటి కష్టాన్ని తెలియజేస్తూ చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా కోసం తాము రెండున్నర సంవత్సరాల నుంచి కష్టపడుతున్నామని తెలిపారు.
హనుమాన్ సినిమా కోసం తాను ఇతర సినిమాలకు కూడా కమిట్ అవ్వలేదని తేజ తెలిపారు. అంతేకాకుండా ఈ సినిమా కోసం దాదాపు 6 గంటల పాటు గాలిలో వేలాడుతూనే ఉన్నానని అదేవిధంగా క్లైమాక్స్ 40 రోజులపాటు దుమ్ము ధూళిలోనే షూటింగ్ చేశామని తెలియజేశారు.
సర్జరీ చేయాలన్నారు..
ఇలా దుమ్ము ఒకవైపు మరోవైపు లెన్సెస్ పెట్టుకొని గ్లిజరిన్ పెట్టుకోవడం వల్ల తన కుడి కంటి చూపు పోయిందని అయితే డాక్టర్ల దగ్గరకు వెళ్తే సర్జరీ చేయాలని కూడా చెప్పారు అంటూ తేజ వెల్లడించారు. కానీ ఈ సినిమా విడుదలైన తర్వాత పనులన్నీ పూర్తి చేసుకున్నాకనే సర్జరీ చేయించుకోవాలని నిర్ణయం తీసుకున్నాను అంటూ ఈ సందర్భంగా హనుమాన్ సినిమా కోసం పడిన కష్టాలను తేజ తెలియచేయడంతో ఇది కాస్త వైరల్ అవుతున్నాయి. దీంతో మీ కష్టానికి తగ్గ ఫలితం దక్కింది అంటూ అభిమానులు కూడా కామెంట్లు చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…