Tejaswi Madivada: సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే. ఇలా ఈ కాస్టింగ్ కౌచ్ ఎప్పటినుంచో ఇండస్ట్రీలో ఉందని ఇలాంటి ఇబ్బందులను ఎంతోమంది నటీమణులు ఎదుర్కొన్నారు అంటూ ఒక్కొక్కరు కెరియర్ మొదట్లో వారు ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి బయట పెడుతూ వచ్చారు. ఇకపోతే తాజాగా నటి తేజస్వి సైతం ఇండస్ట్రీలో ఉన్నటువంటి క్యాస్టింగ్ కౌచ్ గురించి నోరు విప్పారు.
ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ సినిమా ఇండస్ట్రీలో కమిట్మెంట్ అడుగుతారనేది పచ్చి నిజం.ఎంతోమంది ఇండస్ట్రీలో ఎదగాలని ఆశతో ఇక్కడికి అడుగు పెడతారు. అయితే ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో తప్పకుండా ఈ ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని ఈమె తెలిపారు.తనని కూడా ఎంతోమంది కమిట్మెంట్ అడిగారని అయితే అలాంటి వాటికి మనం లొంగిపోకుండా ధైర్యంతో ముందుకు వెళ్లాలని ఈమె సూచించారు.
కేవలం సినిమా ఇండస్ట్రీ అనే కాదు ఏ రంగంలోనైనా ఈ విధమైనటువంటి ఇబ్బందులు ఉంటాయని, వాటిని మనం ధైర్యంగా ఎదుర్కోవాలని తెలిపారు. ఇక ఇలాంటి వాటికి లొంగిపోతే తిరిగి ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నామని చెప్పడం పూర్తిగా తప్పంటూ ఈ సందర్భంగా తేజస్వి ఇండస్ట్రీలో ఉన్నటువంటి కమిట్మెంట్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.
ఇకపోతే తాను సినిమాలు మాత్రమే కాకుండా ఈవెంట్స్ కూడా వెళ్తూ ఉంటానని అక్కడ కూడా ఇలాంటి ఇబ్బందులే ఎదురవుతూ ఉంటాయని ఈమె అసలు విషయం వెల్లడించారు.ఒకసారి ఒక ఈవెంట్ వెళ్ళినప్పుడు అక్కడ జనాలు ఫుల్లుగా తాగి వచ్చి తనని చుట్టూ ముట్టారని ఆ సమయంలో వారి నుంచి తప్పించుకొని వెళ్లడానికి చాలా కష్టపడ్డానని ఈ సందర్భంగా తేజస్వి తాను ఇండస్ట్రీలో ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి బయటపెట్టారు. ఇక తాజాగా ఈమె కమిట్మెంట్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో ఉన్నటువంటి కమిట్మెంట్ గురించి ఈ సందర్భంగా బయటపెట్టారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…