Featured

Veerabhadram Chowdary : భాయ్ సినిమా స్క్రిప్ట్ అంత మార్చేశారు… ఉదయ్ కిరణ్ నా సినిమా చేయకుండా వెళ్ళిపోయాడు… ఆ సినిమాతో నా కెరీర్ పోయింది : వీరభద్రం చౌదరి

Veerabhadhram Chowdary : ‘అహనా పెళ్లంట’ సినిమాతో డైరెక్టర్ గా మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకుని గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు వీరభద్రం చౌదరి ఆ తరువాత తీసిన ‘పూలరంగడు’ సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. ఇక ఇండస్ట్రీ లో సెటిల్ అయినట్లే అని అనుకున్న తరుణంలో నాగార్జున సినిమా ‘భాయ్’ తో మళ్ళీ కెరీర్ ప్రశ్నార్తకంగా మారిపోయింది. ఇక ఉదయ్ కిరణ్ సినిమా ఎలా వదులుకోవాల్సి వచ్చిందో తన సినిమా కెరీర్ లోని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

భాయ్ సినిమాతో కెరీర్ పోయింది…

రెండు సూపర్ హిట్లు వరుసగా ఇచ్చిన వీరభద్రం గారు ఈవివి వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసారు. ఇక ఆయనతో కొన్ని రోజులు పని చేసాక డైరెక్టర్ తేజ తో వర్క్ చేసారు. ఇక ఆనంది ఆర్ట్స్ బ్యానర్ లో ఉదయ్ కిరణ్ తో సినిమా అవకాశం వచ్చింది. సినిమా రెండు రోజుల్లో మొదలువ్వాల్సింది, సినిమా క్యాన్సిల్ అయింది. మొదటి సినిమా ఇలా అయ్యిందే అనుకుని చాలా బాధపడ్డాను. ఉదయ్ కిరణ్ మరో మంచి ఆఫర్ రావడం వాళ్ళ నా సినిమా వదులుకున్నాడు. ఇక మళ్ళీ అహనా పెళ్ళంట సినిమా తీసి హిట్ కొట్టాను. ఆ సినిమా తరువాత పూలరంగడు సినిమా కూడా మంచి హిట్ అయింది.

ఇక నాగార్జున గారితో భాయ్ సినిమా కథ అనుకుని ఓకే అయ్యాక కథలో చాలా మార్పులు చేసారు. సినిమా ప్లాప్ అయింది. వీరి వల్ల తప్పు జరిగిందని ఎవరినీ నిందించలేను కానీ నా కెరీర్ పోయింది అంటూ వీరాభద్రం చెప్పారు. భాయ్ సినిమాను మొదట హాస్యభరితంగానే తీయాలని అనుకున్నాను అయితే కథలో మార్పులు ఎక్కువ అవడం వల్ల కథ రూపు రేఖలు మారిపోయాయి. సినిమా సీరియస్ అయిపోయింది. కామెడీ ఉంటుందని భావించి వచ్చిన ప్రేక్షకులకు ఆ సినిమా నచ్చలేదు అంతే అంటూ చెప్పారు. ఇక రాజశేఖర్ గారి ఒక నాలుగు సినిమాలకు పని చేయడం వల్ల ఆయనతో మంచి అనుబంధం ఉందని తెలిపారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago