మొన్నటి వరకూ బాలీవుడ్ లో సంచలనం సృష్టించిన క్యాస్టింగ్ కౌచ్ వివాదం ఇప్పుడు టాలీవుడ్ లోనూ సంచలనం సృష్టిస్తుంది. టాలీవుడ్ లో శ్రీరెడ్డి కారణంగా మొదలైన క్యాస్టింగ్ కౌచ్ వివాదం ఇప్పుడు తారా స్థాయికి చేరుతుందంటూ జాతీయస్థాయిలో చర్చ జరిగుతుంది. తాజాగా సినీ హీరోయిన్ లపై జరుగుతున్న లైంగిక వేధింపులపై వర్ధమాన నటి తేజస్వి సోషల్ మీడియాలో చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.
ఈమధ్యనే “ఐస్ క్రీమ్” అనే చిత్రం ద్వారా టాలీవుడ్ లోకి అడుగు పెట్టిన తేజస్వి లేటెస్ట్ గా నటిస్తున్న చిత్రం ‘ కమిట్మెంట్’. ఈ చిత్రానికి లక్ష్మికాంత్ చెన్న దర్శకత్వం వహిస్తున్నారు. సినిమా రంగంలో జరుగుతున్న క్యాస్టింగ్ కౌచ్ వివాదం నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన తేజస్వి క్యాస్టింగ్ కౌచ్ పై సంచలనమైన కామెంట్స్ చేసింది. బాలీవుడ్ స్టార్స్ దేనికైనా సిద్దపడతారని, ఏదడిగినా నో చెప్పరని, అందుకనే వాళ్ళని మాత్రమే తీసుకుంటున్నారని, అందులో 20 శాతం మంది వల్లే తమలాంటి వాళ్ళను కూడా అదే పంధాలో చూస్తున్నారని తేజస్వి తెలిపుతూ.. తాను టాలీవుడ్ కి వచ్చిన క్రొత్తలో అందరూ తనని బెడ్ రూమ్ కి వస్తావా అనడిగినవాళ్ళేనని, ప్రత్యక్షంగా ఆ విషయాన్ని అడగలేక పరోక్షంగా దానికి “కమిట్మెంట్” అని పేరు పెట్టారని, అలాంటి కమిట్మెంట్ లకు తాను ఒప్పుకోలేదు కాబట్టే టాలీవుడ్ లో తనకు అవకాశాలు రాలేదని.. మారుతున్న కాలానికనుగుణంగా సినీ ఇండస్ట్రీకి వచ్చేవాళ్ళు అడ్వాన్స్ గా ఆలోచించి కమిట్మెంట్ కి సిద్దపడే వస్తున్నారని, వాళ్లలా సిద్ధమైతేనే ఇక్కడ అవకాశాలొస్తాయని తెలియజేసింది.
ఇలాగే గతంలో తనని ఓ హిందీ వెబ్ సీరీస్ లో న్యూడ్ గా నటించే అవకాశం వచ్చిందని, కానీ అందుకు తానూ ఒప్పుకోకకపోవడంతో ఆ వెబ్ సిరీస్ నుండి తనని తొలగించారని, ఇలాంటి చేదు అనుభవాలతో విసిగిపోయిన తాను ఇకపై నగ్నంగా నటించడానికి సిద్ధమేనని తేజస్వి స్పష్టం చేసింది. సినిమా ఛాన్స్ లు కరువైపోతే ఇంతిలా దిగజారిపోతారా.? అని నెటిజన్లు కూడా ముక్కున వ్రేలేసుకుంటూ అయ్యో పాపం తేజస్వీ అంటూ జాలి చూపిస్తున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…