లాక్ డౌన్ నేపథ్యంలో మద్యం అమ్మకాలపై ఆంక్షలు ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టాలీవుడ్ సీనియర్ నటి రమ్యకృష్ణ కారులో భారీగా అక్రమ మద్యం తరలిస్తూ ఆమె డ్రైవర్ సెల్వకుమార్ చెన్నై పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. పుదుచ్చేరి నుంచి చెన్నైకు అక్రమంగా మద్యం బాటిళ్లను తరలిస్తున్నట్టు గుర్తించారు పోలీసులు. సాధారణంగా అన్ని వాహనాలను చెక్ చేస్తున్న సమయంలో రమ్యకృష్ణ కారు కూడా వచ్చింది. కారు చెక్ చేస్తున్న పోలీసులు అందులో భారీగా మద్యం ఉండటంతో కారును వెంటనే సీజ్ చేసి, డ్రైవర్ సెల్వకుమార్ ను అదుపులో తీసుకున్నారు.
పోలీసులు అందించిన వివరాల ప్రకారం రమ్యకృష్ణ కారులో 96 బీర్ బాటిళ్లు, 8 ఫుల్ బాటిళ్ల మద్యం దొరికాయి. మహాబలిపురం నుంచి చెంగల్పట్టుకు వస్తున్న రమ్యకృష్ణకు చెందిన టయోటా ఇన్నోవా క్రిస్టా( టీఎన్07క్యూ 0099) కారును పోలీసులు తనిఖీ చేశారు.. ఆ సమయంలో మద్యం బాటిళ్లు దొరకడంతో కారుతో సహా బీరు బాటిళ్లను సీజ్ చేసి డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు చెన్నై పోలీసులు. ఆ తరువాత వ్యక్తిగత పూచికత్తుపై డ్రైవర్ సెల్వకుమార్ ను విడుదల చేసినట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై ఇప్పటి వరకు రమ్యకృష్ణ స్పందించలేదు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…