Chiranjeevi: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సినీ నటుడు చిరంజీవి ఇంటికి వెళ్లారు. ఇటీవల భారత ప్రభుత్వం చిరంజీవికి పద్మ విభూషణ్ అవార్డు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఎంతోమంది సినీ సెలబ్రిటీలు చిరంజీవికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇలా చిరంజీవి ఎంతో అత్యుత్తమమైనటువంటి ఈ పురస్కారాన్ని అందుకోవడంతో అభిమానులు ఇతర సినీ సెలబ్రిటీలో ఈయనకు శుభాకాంక్షలు తెలిపారు.
ఇకపోతే ఈయనకు పద్మ విభూషణ్ అవార్డు వచ్చిన సందర్భంగా అందరికీ విందు భోజనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సినీ సెలబ్రిటీలతో పాటు రాజకీయ నాయకులు కూడా హాజరై సందడి చేశారు. ఇక ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా రేవంత్ రెడ్డి చిరంజీవిని అభినందిస్తూ ఆయనకు పుష్పగుచ్చం అందజేశారు.
భారత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి పద్మ విభూషణ్ అవార్డు అందుకున్నటువంటి చిరంజీవికి శుభాకాంక్షలని తెలిపారు. అనంతరం ఈయన చిరంజీవితో మాత్రమే కాకుండా రామ్ చరణ్ తో కూడా కాసేపు ముచ్చటించారు. ఇక ఈయనతో పాటు ఉపముఖ్యమంత్రి స్పీకర్ ఇతర తెలంగాణ మంత్రులు కూడా హాజరయ్యారు.
చిరంజీవికి అభినందనలు..
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మెగాస్టార్ కన్నా ముందు పద్మవిభూషణ్ అందుకున్న నటుడు అక్కినేని నాగేశ్వరరావు . అక్కినేని పద్మ శ్రీ, పద్మభూషణ్ తో పాటు 2011లో కేంద్రప్రభుత్వం పద్మవిభూషణ్ పురస్కారాన్ని అందించింది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…