Dil Raju: తెలంగాణలో మరో రెండు నెలలలో పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా ఎన్నికలు జరుగుతున్నటువంటి తరుణంలో మరోసారి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి. ఇప్పటికే పార్లమెంట్ అభ్యర్థులను కూడా ప్రకటిస్తూ ఆయా పార్టీలు ఎంతో బిజీగా గడుపుతున్నాయి.
ఇలా ఎన్నికలు జరుగుతున్నటువంటి సమయంలో ఉన్నఫలంగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసారు. దీంతో ఈ విషయం కాస్త రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ చర్చలకు కారణమైంది. కెసిఆర్ ని కలిసిన దిల్ రాజు రాజకీయాలలోకి ఏమైనా రాబోతున్నారా అని అందరూ సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.
దిల్ రాజు కేసీఆర్ ని కలవడం వెనుక మరో కారణం ఉందని తెలుస్తుంది. ఫిబ్రవరి 14వ తేదీ తన సోదరుడి కుమారుడు ఆశిష్ రెడ్డి వివాహం ఉదయపూర్ లో ఎంతో ఘనంగా జరగబోతున్న సంగతి మనకు తెలిసిందే. క్రమంలోనే దిల్ రాజు ఈ పెళ్లి పనులలో బిజీగా ఉన్నారు. ఇలా పెళ్లి వేడుకలలో బిజీగా ఉన్నటువంటి ఈయన టాలీవుడ్ సెలబ్రిటీలు అందరిని కలిసి స్వయంగా పెళ్లికి ఆహ్వానిస్తున్నారు.
వివాహ ఆహ్వానం..
ఈ క్రమంలోనే కేసీఆర్ ని కలిసి వివాహానికి ఆహ్వానించారు. ఈ వివాహ మహోత్సవానికి టాలీవుడ్ సెలబ్రిటీలు మాత్రమే కాకుండా రాజకీయ నాయకులు కూడా హాజరు కాబోతున్నారని తెలుస్తోంది. ఇక వీరి వివాహం ఉదయపూర్ లో ఎంతో ఘనంగా జరగబోతున్న సంగతి తెలిసిందే. ఇక ఆశిష్ హీరోగా ఇండస్ట్రీలోకి రౌడీ బాయ్స్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…