Kumari Aunty: కుమారి ఆంటీ ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో మారుమోగిపోతున్నటువంటి పేరు. రోడ్డు పక్కన ఫుడ్ స్టాల్ పెట్టుకొని జీవనం గడుపుతూ ఉన్నటువంటి ఈమెను సోషల్ మీడియా వాళ్ళు భారీ స్థాయిలో ప్రమోట్ చేశారు. ఎన్నో యూట్యూబ్ ఛానల్ ఈమె వద్దకు వెళ్లి ఇంటర్వ్యూ చేయడంతో భారీగా పాపులర్ అయింది.
ఇకపోతే ఇటీవల ఈమె ఫుడ్ బిజినెస్ కి భారీగా డిమాండ్ రావడంతో ఏకంగా ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనదారులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి తరుణంలో ట్రాఫిక్ పోలీసులు ఈమె ఫుడ్ బిజినెస్ క్లోజ్ చేయించారు అయితే సీఎం రేవంత్ రెడ్డి చొరవతో తిరిగి ప్రారంభించారు. ఇలా రేవంత్ రెడ్డి వరకు ఈమె విషయం వెళ్లడంతో మరింత పాపులారిటీ సొంతం చేసుకుంది.
ఇకపోతే తాజాగా ఈమె ఎన్నో ఇంటర్వ్యూలలో పాల్గొంటూ ఉండగా ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి వెళ్లబోతున్నారనే విషయాన్ని చెప్పకనే చెప్పేశారు యాంకర్ మీరు శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో కనిపించబోతున్నారని తెలుస్తోంది అసలు ఎప్పుడు మీకు కాల్ చేశారు ఎప్పుడు వెళ్తున్నారు అంటూ ప్రశ్నించగా ఈమె మాత్రం నవ్వుతూ దయచేసి ఇవేవీ అడగకండి అంటూ సమాధానం చెప్పారు.
సెలబ్రిటీగా మారిన కుమారి ఆంటీ…
ఈ విధంగా కుమారి ఆంటీ ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా తప్పించుకోవడంతోనే ఈమె శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో కనిపించబోతున్నారని తెలుస్తోంది. అయితే ఫుడ్ బిజినెస్ ద్వారా పాపులర్ అయ్యి అదే పాపులారిటీతో బిజినెస్ క్లోజ్ అయ్యి సీఎం చొరవతో తిరిగి ఫుడ్ బిజినెస్ ప్రారంభించిన ఈమె భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు. దీంతో ఏకంగా సెలబ్రిటీ హోదా దక్కించుకున్నారని చెప్పాలి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…