Telangana girl in Bigg Boss Agni Priksha.. Who is Anusha?
బుల్లితెర ప్రేక్షకులను అలరించడానికి బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 సిద్ధమైంది. ఇప్పటికే ఎనిమిది సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ షో, ఈసారి కొత్త కాన్సెప్ట్‌లతో రాబోతుంది. ముఖ్యంగా, తొలిసారిగా సాధారణ ప్రేక్షకులకు కూడా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చేందుకు “బిగ్ బాస్ అగ్నిపరీక్ష” అనే ప్రీ-సీజన్ ఈవెంట్‌ను నిర్వహించనున్నారు.
బిగ్ బాస్ అగ్నిపరీక్ష కోసం ఇప్పటికే వివిధ రంగాల నుంచి 40 మందిని ఎంపిక చేసి, వారిలో నుంచి 15 మందిని ఫైనల్ చేశారని తెలుస్తోంది. ఈ జాబితాలో అనూషా రత్నం అనే పేరు బాగా వినిపిస్తోంది. వరంగల్‌కు చెందిన అనూషా ఎమ్మెస్సీ పూర్తి చేసి, ఐటీ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా ఐదేళ్లు పనిచేశారు. ఆ తర్వాత జాబ్‌కు రాజీనామా చేసి సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌గా మారారు. ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు బిగ్ బాస్ అగ్నిపరీక్ష ద్వారా ఆమె పేరు మరింత హాట్ టాపిక్‌గా మారింది.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్ ప్రీమియర్ సెప్టెంబర్ 7న లేదా సెప్టెంబర్ 15న ప్రారంభమయ్యే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. అయితే, బిగ్ బాస్ అగ్నిపరీక్ష మాత్రం ఆగస్టు 22 నుంచి సెప్టెంబర్ 5 వరకు జియో హాట్‌స్టార్‌లో ప్రసారం అవుతుందని తెలుస్తోంది. ఈ అగ్నిపరీక్షకు హోస్ట్‌గా శ్రీముఖి వ్యవహరించనుండగా, మాజీ కంటెస్టెంట్లు అభిజిత్, బిందు మాధవి, నవదీప్‌లు జడ్జిలుగా ఉంటారని సమాచారం. ఈ అగ్నిపరీక్షలో విజేతలు ప్రధాన బిగ్ బాస్ హౌస్‌లోకి ప్రవేశిస్తారు.
ఈసారి సామాన్యులు బిగ్ బాస్ హౌస్‌లోకి వస్తున్నారనడంతో ప్రేక్షకులు మరింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…