ఓ మై ఫ్రెండ్, MCA చిత్రాల దర్శకుడు వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొంత విరామం తర్వాత నటిస్తున్న తాజా చిత్రం వకీల్ సాబ్.. బోనీ కపూర్ సమర్పణలో దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.. బాలీవుడ్ సూపర్ హిట్ పింక్ అనే సినిమాకి ఇది రీమేక్ గా తెరకెక్కింది.. బాలీవుడ్ లో అమితాబ్ బచ్చన్ పోషించిన పాత్రను.. వకీల్ సాబ్ లో పవన్ కళ్యాణ్ పోషించారు.. ఇక ఈ చిత్రానికి యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో పవర్ స్టార్.. లాయర్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. వకీల్ సాబ్’ ప్రకటించినప్పటి నుంచే దీనిపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి… ఇక తాజాగా విడుదల చేసిన ట్రైలర్.. ఆ అంచనాలను రెట్టింపు చేసింది..
వకీల్ సాబ్ ట్రైలర్ ను సోమవారం సాయంత్రం దాదాపు చాలా థియేటర్లలో రిలీజ్ చేశారు.. ప్రస్తుతం ఈ ట్రైలర్ రికార్డ్ స్థాయి వ్యూస్ తో దూసుకుపోతోంది..ఇక ఇదిలా ఉంటె యూసుఫ్‌గూడ పోలీస్ లైన్స్‌లోని స్పోర్ట్స్ గ్రౌండ్స్‌లో ఏప్రిల్ 3వ తేదీన నిర్వహించ తలపెట్టిన వకీల్‌సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు జూబ్లీహిల్స్ పోలీసులు అనుమతి నిరాకరించారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్‌సాబ్ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌ను జె.మీడియా ఫ్యాక్టరీ నిర్వహించాలని తలపెట్టి ఇందుకోసం జూబ్లీహిల్స్ పోలీసులకు అనుమతి మంజూరు కోరుతూ లేఖ రాశారు. అయితే కోవిడ్-19 పంజా విసురుతున్న నేపథ్యంలో ఎలాంటి మీటింగ్‌లు, సభలు, సమావేశాలకు అనుమతులు లేవని చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ ఇటీవలనే జీవో జారీ చేశారు.
ఆ జీవో ప్రకారం వకీల్‌సాబ్ సిని మా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు అనుమతి నిరాకరించినట్లు జూబ్లీహిల్స్ ఇన్‌స్పెక్టర్ రాజశేఖర్‌రెడ్డి తెలిపారు.ఈ ఈవెంట్‌కు 5 నుంచి 6 వేల మంది హాజరవుతారని నిర్వాహకులు అర్జున్, ప్రశాంత్ తమకు ఇచ్చిన లేఖలో పేర్కొనడం జరిగిందని, తాజా జీవో ప్రకారం ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతులు కుదరవని స్పష్టం చేశారు…ఇక ఏప్రిల్ 9 న ఈ సినిమా విడుదల కానుంది..!!
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…