మెగాబ్రదర్ నాగబాబు ఈ మధ్య సోషల్ మీడియాలో తన అభిమానులతో లైవ్ చాటింగ్ లో పాల్గొంటూ..వారి ప్రశ్నలకు ధీటుగా సమాధానాలు ఇస్తున్నారు.. ఇప్పుడు అలాంటి ఓ ప్రశ్నకు షాకింగ్ రిప్లై ఇచ్చారు నాగబాబు.. ఆ వివరాల్లోకి వెళ్తే.. ఇటీవలె తన కూతురు నిహారికకు పెళ్లి చేసిన నాగబాబు ..త్వరలోనే వరుణ్‌తేజ్‌ని సైతం ఓ ఇంటి వాడిని చేయాలని చూస్తున్నట్లు గుసగుసలు వినిపించాయి. ఇప్పటికే అమ్మాయిని కూడా వెతికే పనిలో పడ్డారని సమాచారం..
ఇదిలా ఉంటె నాగబాబుకి అరవై ఏళ్లు వచ్చినా కూడా.. ఆయనలో మరో పెళ్లి ఆశ మాత్రం చావనే లేదు. ఈ వయసులో కూడా రెండో పెళ్లికి సై అంటూ నాగబాబు సరదాగా చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఇక ఇప్పటికే పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడంటూ సమయం సందర్భం కాకపోయినా నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు చాలామంది. ఈ మూడు పెళ్లిళ్ల విషయంలో ఏం మాట్లాడాలో తెలీక.. పవన్ కళ్యాణ్ మౌనం వహిస్తూ ఉంటారు. అయితే తమ్ముడు తీర్చుకున్న మూడు పెళ్లిళ్ల ముచ్చటను తాను ఫాలో కావాలని అనుకుంటున్నారో ఏమో కానీ.. నాగబాబు తన మనసులో కోరికను బయటపెట్టారు..
తాజాగా ఇన్‌స్టాగ్రామ్ లైవ్ చాట్‌లో ఫ్యాన్స్‌తో ముచ్చటిస్తున్న నాగబాబుకు ఓ అభిమాని నుంచి ఊహించని ప్రశ్న ఎదురైంది. ‘సర్..మీరు మళ్లీ పెళ్లి చేసుకుంటారా అని ఓ నెటిజన్ అడగ్గా..ఈ వయసులో నాకు పెళ్లా..మీరంతా ఓకే అంటే నాకు కూడా ఓకే’ అంటూ నాగబాబు సరదాగా బదులిచ్చారు.రెండో పెళ్లిపై నాగబాబు చేసిన ఈ కామెంట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్లను షేర్ చేస్తూ పలువురు దీన్ని ట్రెండ్ చేస్తున్నారు. మరోవైపు రెండో పెళ్లిపై నాగబాబు చేసిన కామెంట్‌పై కొందరు నెటిజన్లు అవాక్కవుతున్నారు. ‘మీరంతా ఓకే అంటే నాకు కూడా ఓకే అంటున్నారంటే..మీ మనసులోనూ రెండో పెళ్లిపై ఆలోచన ఉందా?మీరు కూడా మీ తమ్ముడు పవన్‌కల్యాణ్ బాటలోనే నడుస్తారా’ ? అంటూ కొందరు నెటిజన్లు నాగబాబు పై సెటైర్లు పేలుస్తున్నారు…!!
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…