క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా.. విలన్ గా మరియు కమెడియన్ గా కూడా కొన్ని వందల సినిమాల్లో నటించిన టార్జన్ అలియాస్ ఎదిరె ఎదిరె లక్ష్మీనారాయణ గుప్తా తెలుగు ప్రేక్షకులకు బాగా తెలుసు. చూడటానికి ఎత్తు పర్సనాలిటీ ఉన్న టార్జాన్ ను చూసి తెలుగు ప్రేక్షకులు భయపడిపోయారు. ఆర్జీవీ దర్శకత్వం వహించిన ‘గాయం’ చిత్రంతో సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన టార్జాన్ తర్వాత శివ, క్షణక్షణం వంటి చిత్రాల్లో నటుడిగా మెప్పించాడు.
30 ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. అయితే ఆయన భార్య మరణంతో పాటు.. మధ్యలో కొన్నాళ్లు ఇండస్ట్రీకి దూరం అయ్యారు టార్జాన్. ఇటీవల వచ్చిన టెంప్ట్ రాజా సినిమాతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. తాజాగా ఓ ట్యూబ్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కనిపించిన ఆయన పలు ఆసక్తికరమైన విషయాలను షేర్ చేసుకున్నారు. తన జీవితంలో ఎదురైన అనుభవాలను.. సినిమాలకు దూరం అవడానికి కారణాలను తెలిపారు. ఇండస్ట్రీలో టాలెంట్ ఒక్కటే ఉంటె సరిపోదని.. దానితో పాటు లక్ కూడా ఉండాలన్నారు. ఎంతో కష్టపడి తాను ఈ స్టేజ్ కి వచ్చినట్లు చెప్పుకొచ్చాడు. కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల మధ్యలో బిజినెస్ చేసినట్లు చెప్పాడు.
ఇండస్ట్రీకి వచ్చే ముందు వచ్చిన తరువాత కూడా చాలా కష్టాలు అనుభవించినట్లు చెప్పుకొచ్చాడు. అయితే అతడిది పరిగి అనే ఊరిలో రాపోలు అనే చిన్న గ్రామం. వాళ్ల నాన్న ఊరిలో సర్పంచ్ గా ఉండేవారు. మేమంటే పడనివాళ్లు మా ఫ్యామిలీ మొత్తానికి బాణామతి (చేతబడి) చేయించారని.. రెండేళ్ల పాటు చాలా కష్టాలు అనుభవించామన్నారు. ఆ టైంలో తినడానికి తిండిలేదు.. వేసుకోవడానికి బట్టలు కూడా ఉండేవి కాదు. ‘నాకు 18 ఏళ్లు ఉన్నప్పుడు మా ఊరి నుంచి వచ్చేశాం.. అన్నీ అమ్ముకుని హైదరాబాద్ వచ్చేశాం.. ఇక్కడకు వచ్చేసరికి నా ఒంటి మీద షర్ట్ కూడా లేదు. భూములు, బంగారం మొత్తం అమ్ముకున్నాం.. తిండిలేకుండా పస్తులు ఉన్నాం.. ఆ పని ఈ పని కాకుండా అన్ని పనులు చేశాం.. ఆ టైంలోనే భగవంతుడు మాకు ట్రాన్స్ పోర్ట్ బిజినెస్ ఇచ్చి ఆదుకున్నాడు’ అంటూ ఆయన చెప్పుకొచ్చాడు.
చేతబడి ఎవరు చేశారో తెలుసని.. కేసులు కూడా అయ్యాయని.. కానీ మేం వదిలేశామని చెప్పాడు. ఈ రోజుల్లో ఇవి ఉన్నాయంటే.. నమ్మరు.. కానీ మాకు జరిగింది కాబట్టి మేం నమ్ముతున్నాం అని టార్జాన్ చెప్పాడు. తన తండ్రి మరియు తన అన్న తో పాటు తాను కూడా అనారోగ్యానికి గురైనట్లు తెలిపారు. గ్రామం లో ఉన్నప్పుడు ఏం తిన్నా కూడా తన అన్న వాంతి చేసుకునే వారని చెప్పారు. కొన్ని రోజులు గడిచినా కూడా ఆ సమస్య తగ్గలేదని చెప్పారు. దాంతో తాము అన్ని అమ్ముకొని హైదరాబాద్ కు వచ్చామని తెలిపారు. హైదరాబాద్ వచ్చిన తరువాత అన్నీ సర్దుకున్నాయన్నారు. ఇప్పుడు అంతా సంతోషంగా ఉన్నామన్నారు.
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…
మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…
టాలీవుడ్‌లో అభిమానులను ఆందోళనకు గురిచేసిన వార్తపై స్పష్టత వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడిన ఘటనపై ఆయన సోదరి…
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్‌లోని ఆస్తుల…