Movie News

పుకార్లకు చెక్.. క్లారిటీ ఇచ్చేసిన ఆ జంట..!

వెండితెరపై అయినా.. బుల్లితెరపై అయినా ఒక పెయిర్ హిట్ అయిందంటే వారిద్దరి మధ్య ఏదో ఉన్నట్లు పుకార్లు షికార్లు అవుతాయి. వారిద్దరికి సంబంధించి ఏ వార్త వచ్చినా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అయితే ఇలా నెటిజన్లు కొన్ని పుకార్లను స్పష్టిస్తారు. అందులో కొన్ని నిజాలు ఉండొచ్చు.. మరికొన్ని అబద్దాలు కూడా ఉండొచ్చు. పెళ్లి కాకముందు నాగచైతన్య, సమంత మధ్య ప్రేమ నడుస్తుందని.. వారిద్దరి జంట గురించి వార్తలు పెద్ద ఎత్తున వచ్చాయి.

ఇలా వారు పెళ్లి చేసుకొని నెటిజన్ల పుకార్లను నిజం చేశారు. ఇలా జంటల మధ్య ఏదో ఉన్నట్లు క్రియేట్ చేయడం ప్రస్తుతం కొంతమందికి అలవాటయింది. అయితే ప్రస్తుతం మనం చెప్పుకునే జంట ఎవరంటే.. మౌనరాగం సీరియల్ లో నటించిన ప్రియాంక జైన్ మరియు శివ కుమార్. ప్రియాంక జైన్ మొదట్లో కొన్ని సినిమాల్లో నిటించినా అంతగా పేరు రాలేదు. తర్వాత మౌనరాగం సీరియల్ లో లీడ్ రోల్ పాత్ర చేసింది. మౌనరాగం సీరియల్ ఎంత పెద్ద హిట్ అయిందో.. అదే తరహాలో వీరి జంట కూడా అతి పెద్ద హిట్ అయింది.

అమ్ములుగా ఓ మూగ క్యారెక్టర్ చేసిన ప్రియాంక ప్రేక్షకులను మెప్పించింది. తన నటన, అభినయంతో తనకంటూ ఓ స్థానాన్ని ఏర్పరచుకుంది. దీంతో ఆమెకు మౌనరాగం సీరియల్ తర్వాత జానకి కలగనలేదు సీరియల్ లో అవకాశం లభించింది. ఇక మౌనరాగం సీరియల్ లో అంకిత్ క్యారెక్టర్ చేసిన శివ కుమార్ కూడా నటనలో తనకంటూ పేరు తెచ్చుకున్నాడు. అయితే ఆ సీరియల్ నుంచే వీరిద్దరు ప్రేమ ఉందని.. పుకార్లు వచ్చిన సంగతి తెలిసిందే. వీరిద్దరు సోషల్ మీడియాలో తెగ యాక్టీవ్ గా ఉంటారు. ఫొటోలను షేర్ చేస్తూ తమ అభిమానులకు టచ్ లో ఉంటున్నారు. వీరిద్దరు ఎక్కువ దూరం ట్రావెల్ చేస్తుంటారని.. రాత్రి పబ్ లు, పార్టీలు అంటూ తిరుగుతుంటారని.. వీరిద్దరి మధ్య లైవ్ కాల్స్ కూడా నడుస్తున్నాయని సోషల్ మీడియలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.

అయితే వీరి మధ్య ఎన్నో జరిగాయని వార్తలు వస్తున్న సమయంలో ఈ మధ్యన ఇద్దరు ఒకే కలర్ డ్రస్ వేసుకొని గుడిలో దర్శనమిచ్చారు. అచ్చం భార్యభర్తలులాగా ఉన్న ఈ ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. తాజాగా లైవ్ కి వచ్చి మాట్లాడిన వీళ్లు.. వీటికి క్లారిటీ ఇచ్చే పని చేశారు. వీళ్ల పెళ్లి గురించి నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపించారు. అందులో ఒకరు మీరు పెళ్లి చేసకుంటున్నారా.. అని అడగడంతో ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ.. నువ్వు చెప్పు అంటే నుమ్ము చెప్పు అని సరదాగా ప్రశ్నలు వేసుకున్నారు. అయితే దీనికి సమాధానం త్వరలోనే ఇస్తామని అన్నారు. మీరు అమ్ముల్ని లవ్ చేస్తున్నారా.. అని ఓ నెటిజన్ శివను అడగ్గా.. అవును అని సమాధానం ఇచ్చాడు. దీంతో వీరిద్దరి మధ్య ప్రేమ ఉందని క్లారిటీకి వచ్చేసింది. త్వరలో ఈ బుల్లితెర జంట పెళ్లిపీటలపై కూర్చుంటారని తెలుస్తోంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

కోదండరామస్వామి ఆలయంలో ఏప్రిల్ 23న ఆధ్యాత్మిక మహోత్సవం!

తిరుపతిలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ కోదండరామస్వామి ఆలయంలో ఆధ్యాత్మిక ఉత్సాహం నెలకొంది. ఏప్రిల్ 23న జరిగే పుష్పయాగ మహోత్సవానికి ఆలయ…

11 minutes ago

44 డిగ్రీలకు చేరే ఉష్ణోగ్రతలు.. మూడు రోజులు హెచ్చరిక

తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…

14 hours ago

ప్రభాస్ ‘ఫౌజీ’ ఛాన్స్ వదిలేసిన టాలీవుడ్ హీరో ఎవరు?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…

14 hours ago

180 బాధితులు.. దేశాన్ని షాక్‌కు గురిచేసిన ఘటన

మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…

14 hours ago

వరుణ్ తేజ్ గాయం.. నిహారిక ఎమోషనల్ ప్రెస్ నోట్

టాలీవుడ్‌లో అభిమానులను ఆందోళనకు గురిచేసిన వార్తపై స్పష్టత వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడిన ఘటనపై ఆయన సోదరి…

15 hours ago

అటెండర్ మాస్టర్ ప్లాన్.. SBIకి రూ.2.65 కోట్ల షాక్!

తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…

17 hours ago