Telugu Language : మానవులలో అత్యంత అందమైన విషయం వారి భాష. భాష మనిషికి మనిషికి మధ్య సంబంధాలను పెంపొందించేదిగా ఉండాలి. ఏ భాషకైనా అదే ప్రమాణం. ప్రతి భాషకూ తనదైన అందం ఉంటుంది. మన దేశంలో చాలా జాతులు తెగలు ఉండటం వల్ల దేశం మొత్తం ఒకే భాష లేదు. కానీ అందరు కలిసి మెలిసి జీవిస్తాము. ప్రతి భాషని, సంప్రదాయాన్ని గౌరవిస్తూ జీవిస్తున్నాం. అందుకే మనది భిన్నత్వంలో ఏకత్వం.
తెలుగు భాష 4వ స్థానంలో ఉంది…
దేశంలో కనీసం పది వేల మంది మాట్లాడే భాషను గుర్తిస్తారు. అలా మన దేశంలో సుమారు 121 భాషలు ఉన్నాయి. 19,500 భాషలు, యాసలు మన దేశంలో మొత్తంగా ఉన్నాయి. ఇక రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో తెలుగు మాతృభాష మరియు అధికార భాష. ఈ రాష్ట్రాల్లోనే కాకుండా భారతదేశంలో ఒకటి కంటే ఎక్కువ రాష్ట్రాల్లో ప్రాథమిక అధికారిక భాష హోదా కలిగిన కొన్ని భాషలలో హిందీ, బెంగాలీలతో పాటు తెలుగు కూడా ఉంది. పుదుచ్చేరిలోని యానం జిల్లాలో తెలుగు అధికారిక భాష. ఒడిశా, కర్ణాటక, తమిళనాడు, కేరళ, పంజాబ్, మహారాష్ట్ర ఛత్తీస్‌గఢ్, అండమాన్ నికోబార్ దీవులలో గుర్తించబడిన అల్పసంఖ్యాక భాష. దేశ ప్రభుత్వం భారతదేశ ప్రాచీన భాషగా గుర్తించిన ఆరు భాషలలో తెలుగు ఒకటి. ఇక తాజాగా 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో ఎంతమంది ఏ భాషను మాట్లాడుతున్నారో, ఆ సంఖ్యను బట్టి భాష స్థానాన్ని నిర్ణయించారు.
ఇందులో మొదటి స్థానంలో హిందీ నిలిచింది. 52.83 కోట్ల మంది హిందీ మాట్లాడుతున్నారు.
ఇక బెంగాలీ 9.72 కోట్ల మంది మాట్లాడుతూ రెండవ స్థానంలో నిలిచింది.
ఇక 8.30 కోట్ల మంది మాట్లాడుతూ మరాఠి మూడో స్థానంలో నిలిచింది.
మన తెలుగు భాష 8.11 కోట్ల మంది మాట్లాడుతూ నాలుగో స్థానంలో నిలిచింది.
6.90 కోట్ల మంది మాట్లాడుతూ తమిళం ఐదవ స్థానంలో నిలిచింది.
ఆరవ స్థానంలో 5.54 కోట్ల మంది మాట్లాడుతూ గుజరాతి నిలిచింది.
5.07 కోట్ల మంది మాట్లాడుతూ ఉర్దూ ఏడవ స్థానంలో ఉంది.
4. 37 కోట్ల మంది మాట్లాడుతూ కన్నడ ఎనిమిదవ స్థానంలో ఉంది.
3.75 కోట్ల మంది మాట్లాడుతూ ఒడియా భాష తొమ్మిదవ స్థానంలో నిలిచింది.
ఇక 3.48 కోట్ల మంది మాట్లాడుతూ మలయాళం పదవ స్థానంలో నిలిచింది. అలా దక్షిణాది ద్రావిడ భాషలలో ఎక్కువమంది మాట్లాడే మొదటి భాషగా తెలుగు నిలిచింది. మిగిలిన మూడు భాషలు టాప్ పది లోనే ఉండటం విశేషం.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…