Featured

Thaman : ఎన్ని ట్రోల్ల్స్ వచ్చినా.. థమన్ కాపీ ట్యూన్స్ చేయడం మానరా..?

Thaman : ప్రస్తుతం తెలుగు చలన చిత్ర పరిశ్రమ లో టాప్ హీరో ల సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా ఫస్ట్ ఆప్షన్ ఎవరంటే థమన్ అనే అంటున్నారు. మళ్ళీ మళ్ళీ సినిమాతో తన కెరీర్ ను మొదలు పెట్టిన థమన్ కిక్ సినిమాతో మంచి విజయాన్ని తాన ఖాతా లో వేసుకున్నారు. అయితే ఇన్ని బ్లాక్ బస్టర్ సినిమాలకు సంగీతం అందించిన తన మీద వచ్చినన్ని ట్రోల్ల్స్, కామెంట్స్ ఇంకా మిగతా ఏ మ్యూజిక్ డైరెక్టర్ మీద రాలేదు. ఇందుకు కారణం ఒకానొక సమయం లో థమన్ నుంచి ఒకేరకమైన ట్యూన్స్ రావడం. దాదాపుగా థమన్ పాటలు వింటే ఇది ఎక్కడో విన్నట్టుందే అన్న భావన కలుగుతుంది.

కానీ అరవింద సమేత వీర రాఘవ సినిమా నుంచి ఈయన పంథా మారింది అనే చెప్పుకోవచ్చు. థమన్ పాటల్లో కొత్తదనం చూపిస్తూన్నారు. ఇక నేపథ్య సంగీతం విషయంలో అయితే అఖండ సినిమాతో తనని తాను నిరూపించుకున్నాడు. ఇటీవల కాలంలో తమన్‌ బీజీఎంలు చాలా బలంగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం బ్లాక్ బస్టర్ హిట్లు ఇస్తూ ఫామ్ లో ఉన్నప్పటికీ థమన్ మీద కామెంట్స్ ఐతే ఆగట్లేదు.

ట్రోల్లర్స్ కి టార్గెట్ అవుతున్న థమన్….

తాజాగా థమన్ సర్కారు వారి పాట సినిమాకు సంగీతం అందించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా నుండి విడుదల అయిన కళావతి పాట రికార్డులను క్రియేట చేసింది . ఇది ఇలా ఉంచితే సర్కారు వారి పాట నుండి ‘మ మ మహేషా’ అనే మాస్ సాంగ్ వింటుంటే జనాలకు ఆ ట్యూన్ ఎక్కడో విన్నట్లుగా అనిపిస్తోంది. అయితే తమన్‌ సంగీతంలో గతంలో వచ్చిన ‘ఛల్ మోహన రంగా’ సినిమాలోని ‘ఫస్ట్ లుక్కు సోమవారం…’ అనే పాటకు ఈ పాట చాలా దగ్గరగా ఉంది అన్న వార్తలు వస్తున్నాయి. కాకపోతే ఆ సినిమాలో పాట కొంచెం నెమ్మదిగా ఉండి, క్లాస్‌గా ఉంటే.. ‘మ మ మహేష్’ సాంగ్ వేగంగా, మాసీగా ఉంది అంటున్నారు. దీంతో ఆ రెండు పాటలను పోలుస్తూ నేటిజన్లు.. ఇంత సిమిలర్ ట్యూన్స్ ఎలా చేస్తారు థమన్ అని కామెంట్లు చేస్తున్నారు

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago