Thaman : ప్రస్తుతం తెలుగు చలన చిత్ర పరిశ్రమ లో టాప్ హీరో ల సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా ఫస్ట్ ఆప్షన్ ఎవరంటే థమన్ అనే అంటున్నారు. మళ్ళీ మళ్ళీ సినిమాతో తన కెరీర్ ను మొదలు పెట్టిన థమన్ కిక్ సినిమాతో మంచి విజయాన్ని తాన ఖాతా లో వేసుకున్నారు. అయితే ఇన్ని బ్లాక్ బస్టర్ సినిమాలకు సంగీతం అందించిన తన మీద వచ్చినన్ని ట్రోల్ల్స్, కామెంట్స్ ఇంకా మిగతా ఏ మ్యూజిక్ డైరెక్టర్ మీద రాలేదు. ఇందుకు కారణం ఒకానొక సమయం లో థమన్ నుంచి ఒకేరకమైన ట్యూన్స్ రావడం. దాదాపుగా థమన్ పాటలు వింటే ఇది ఎక్కడో విన్నట్టుందే అన్న భావన కలుగుతుంది.

కానీ అరవింద సమేత వీర రాఘవ సినిమా నుంచి ఈయన పంథా మారింది అనే చెప్పుకోవచ్చు. థమన్ పాటల్లో కొత్తదనం చూపిస్తూన్నారు. ఇక నేపథ్య సంగీతం విషయంలో అయితే అఖండ సినిమాతో తనని తాను నిరూపించుకున్నాడు. ఇటీవల కాలంలో తమన్ బీజీఎంలు చాలా బలంగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం బ్లాక్ బస్టర్ హిట్లు ఇస్తూ ఫామ్ లో ఉన్నప్పటికీ థమన్ మీద కామెంట్స్ ఐతే ఆగట్లేదు.
ట్రోల్లర్స్ కి టార్గెట్ అవుతున్న థమన్….
తాజాగా థమన్ సర్కారు వారి పాట సినిమాకు సంగీతం అందించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా నుండి విడుదల అయిన కళావతి పాట రికార్డులను క్రియేట చేసింది . ఇది ఇలా ఉంచితే సర్కారు వారి పాట నుండి ‘మ మ మహేషా’ అనే మాస్ సాంగ్ వింటుంటే జనాలకు ఆ ట్యూన్ ఎక్కడో విన్నట్లుగా అనిపిస్తోంది. అయితే తమన్ సంగీతంలో గతంలో వచ్చిన ‘ఛల్ మోహన రంగా’ సినిమాలోని ‘ఫస్ట్ లుక్కు సోమవారం…’ అనే పాటకు ఈ పాట చాలా దగ్గరగా ఉంది అన్న వార్తలు వస్తున్నాయి. కాకపోతే ఆ సినిమాలో పాట కొంచెం నెమ్మదిగా ఉండి, క్లాస్‌గా ఉంటే.. ‘మ మ మహేష్’ సాంగ్ వేగంగా, మాసీగా ఉంది అంటున్నారు. దీంతో ఆ రెండు పాటలను పోలుస్తూ నేటిజన్లు.. ఇంత సిమిలర్ ట్యూన్స్ ఎలా చేస్తారు థమన్ అని కామెంట్లు చేస్తున్నారు






























