సంగీత దర్శకుడు తమన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ సినిమాకు సంగీత దర్శకుడిగా పనిచేసినా.. ఆ సినిమాలోని పాటలు అన్నీ బంపర్ హిట్ అవుతున్నాయి. అల వైకుంఠపురం సినిమాకు సంబంధించిన పాటలు యూట్యూబ్ లో ఎన్ని మిలియన్స్ వ్యూస్ వచ్చాయే అందరికీ తెలిసిందే.
అలా అతడు ప్రస్తుతం తన సంగీతంతోనే తన రికార్డులను తానే చెరిపేసుకుంటూ దూసుకుపోతున్నాడు. ఒక్క తెలుగులోనే కాదు.. సౌత్ లోనే అతడి హవా కొనసాగుతోంది. అయితే ఇంత మంచి సక్సెస్ అందుకుంటున్న తమన్ ఇటీవల విడుదలైన నాని టక్ జగదీష్ విషయంలో కాస్త బాధపడ్డాడట. అతడు ఆ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇస్తే నానికి నచ్చలేదు.. దీంతో గోపీసుందర్ ర్ తో చేయించుకున్నారని తెలిపారు.
ఇక తనకు బాలీవుడ్ కు ఉన్న సంబంధాన్ని గురించి తెలిపాడు. బాలీవుడ్ లో సంగీత దర్శకుడిగా చేయడం వేరు.. సౌత్ లో సంగీతం అందించడం వేరు అని అన్నాడు. బాలీవుడ్ లో సంగీతం ఒక్కడే అందిచడం అనేది ఉండదని.. ఒక్క సినిమాకు ఇద్దరు ముగ్గురు సంగీత దర్శకులు కలిసి పని చేస్తారన్నారు. అంతే కాకుండా.. బ్యాక్ గ్రౌండ్ స్కోరు మరొకకు ఇస్తారంటూ చెప్పాడు.
ఒకే సినిమాకు సంబంధించి మొత్తం సంగీతం అనేది ఒక్క దర్శకుడికి ఇస్తేనే బాగా చేయగలం.. ఇలా ఇద్దరు ముగ్గురికి ఇస్తే సంగీతం కంపోజ్ చేయడం తన వల్ల కాదు అని.. అందుకే బాలీవుడ్ నుంచి పారిపోయి సౌత్ కు వచ్చినట్లు చెప్పాడు. అతడు బాలీవుడ్ లో అజయ్ దేవగణ్ గోల్ మాల్, రణ్ వీర్ సింగ్ సింబా సినిమాలకు పని చేశాను అంటూ తమన్ నాటి విషయాలను గుర్తు చేశాడు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…