Thammareddy Bharadwaj : నరేష్, పవిత్ర లోకేష్ ల మధ్య ఉన్న రిలేషన్, నరేష్, ఆయన మూడో భార్య రమ్య మధ్య ఉన్న గొడవలు ఇపుడు మీడియా ఫోకస్ అంతా ఇదే. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుని మీడియా ముందుకు పంచాయితీ తెచ్చుకున్న నరేష్ రమ్య విడాకుల విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. ఇక పవిత్ర లోకేష్ నరేష్ తో సహజీవనం చేస్తోందటూ వార్తలు వినిపిస్తున్నా పవిత్ర లోకేష్ భర్త ఆమెతో ఇంకా విడాకులు తీసుకోలేదని చెప్పడం కొసమెరుపు.
చిన్నపిల్లలు కాదుకదా యాభై దాటాయి…
ఇక ఈ ఇష్యూ మీద చాలా మంది ఎవరికి తోచినట్లు వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇక ఇపుడు తాజాగా ప్రముఖ డైరెక్టర్, నిర్మాత అయిన తమ్మారెడ్డి భరద్వాజ్ గారిని ఒక ఇంటర్వ్యూ లో అడుగగా వారి వ్యక్తిగత విషయంలో వేలు పెట్టడం ఎందుకు అంటూ మాట్లాడారు. యూట్యూబ్ లో వీడియోస్ చూస్తూ అందరూ ఎంజాయ్ చేస్తున్నారు కానీ అది వల్ల సొంత విషయం, అందులో ఎవరు మాట్లాడినా పరిష్కారం మాత్రం కనుగొనాల్సింది వాళ్ళే అని అన్నారు. వాళ్ళేం చిన్నపిల్లలు కాదు కదా యాభై, అరవై ఏళ్ళు దాటిన వాళ్ళే, వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకోగలరు అంటూ చెప్పారు. మూడో వ్యక్తి దూరకపోతేనే మంచిది అంటూ సలహా ఇచ్చారు.
ఇక భరద్వాజ గారు చిన్న సినిమా ఫంక్షన్స్ కి ఎక్కువగా రావడానికి కారణం అడుగగా, పెద్ద సెలబ్రిటీలను పిలిచి వేడుక చేసేంత సీన్ చిన్న సినిమా వాళ్లకు ఉండదు. ఇక మీడియా కొంచెం ప్రముఖ సెలబ్రిటీ లేకపోతే కెమెరా తీసుకుని రారు. అందుకే వాళ్లకు ఉన్న ఆప్షన్ నేను. అంతే కానీ నేనేం వాళ్లకు ఫేవరెట్ అయ్యో, లేక నేను ఓ పెద్ద సెలబ్రిటీ అనో నన్ను పిలవరు అంటూ సరదాగా వాఖ్యణించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…