Featured

Thammareddy Bhardwaja : కోటి రూపాయలు వాల్యూ ఉన్న హీరోకి నలభై కోట్లు ఇచ్చి తప్పు చేసింది మీరు : తమ్మారెడ్డి భరద్వాజ

Thammareddy Bharadwaja : సినిమా ఇండస్ట్రీ లో ప్రస్తుతం జరుగుతున్న చర్చ సినిమా షూటింగుల బంద్. దీని వల్ల నిర్మాతల సమస్యలు పరిష్కారం అవుతాయో లేదో కానీ కార్మికులకు మాత్రం తీవ్ర నష్టం వాటిల్లుతుంది. కొంతమంది నిర్మాతలు వారి స్వప్రయోజనాల కోసం ఈ బంద్ కి పూనుకున్నారని కొంతమంది సీనియర్ నిర్మాతలు అభిప్రాయ పడుతున్నారు. ఇక హీరోలు తమ రెమ్యూనరేషన్లు తగ్గించుకోవాలి అంటూ నిర్మాతల గిల్డ్ చేస్తున్న డిమాండ్ ను కూడా తప్పు బడుతున్నారు. ఇక ఈ అంశాల మీద ఇప్పటికే అశ్విని దత్, నట్టి కుమార్ వంటి వాడు స్పందించారు. ఇక ఇపుడు సీనియర్ ప్రొడ్యూసర్, డైరెక్టర్ తమ్మారెడ్డి భరద్వాజ కూడా స్పందించారు.

కోటి రూపాయల హీరోకి నలభై కోట్లు ఇవ్వడమెందుకు…

హీరో రెమ్యూనరేషన్ల గురించి మాట్లాడుతూ తమ్మారెడ్డి గారు ప్రస్తుత నిర్మాతల మీద ఘాటు వాఖ్యలు చేసారు. పది మంది ప్రొడక్షన్ హౌస్ లు పెట్టుకుని సినిమాలు తీస్తూ ఎక్కువ రెమ్యూనరేషన్లల్ని ఒక ఇద్దరు హీరోలకి ఇస్తే మిగిలిన వాళ్ళు కూడా అడుగుతారు కదా. నువ్వు ఇవ్వను అంటే హీరోలు డిమాండ్ చేయరు. నువ్వు ఇవ్వడం అలవాటు చేసుకుని వాళ్లను మీద నిందలేస్తే ఎలా. ఒక హీరోకి ఎన్ని కోట్లు ఇస్తే ఇంకో హీరో ఖచ్చితంగా డిమాండ్ చేస్తాడు. పది కోట్లు తీసుకునే హీరో నువ్వు పక్క హీరోకి నలభై కోట్లు ఇస్తున్నావని ఖచ్చితంగా నలభై కోట్లు అడుగుతాడు. ఒక రోజుకే ఆ హీరో డిమాండ్ పది నుండి నలభై కి పోతుంది. నాకు వంద కోట్ల మార్కెట్ ఉంది నాకు ఇవ్వు నలభై కోట్లు అంటారు. సినిమాలను పాన్ ఇండియా అనే పిచ్చి లో పడి తెలుగు నేటివిటీ మర్చి పోయి తీస్తూ బడ్జెట్ పెంచుకుంటూ పోతే నష్టం భరించాల్సి వస్తుంది. ఒక ఆచార్య విషయంలోనే కాదు చాలా సినిమాల విషయంలో ఇలాగే జరిగితోంది. ప్రొడక్షన్ కాస్ట్ అదుపులో పెట్టుకుంటే ఇన్ని సమస్యలు రావు కదా. హిందీ లో అమితాబ్ బచ్చన్ నటించిన పింక్ సినిమాలో కోర్ట్ సన్నివేశం మూడు రోజుల్లో చిత్రికరిస్తే ఇక్కడ తెలుగులో పది రోజులపైనే కేవలం కోర్ట్ సీన్ తీశారు. సినిమాకు పదికోట్లు ఖర్చు పెడితే ఇక్కడ యాభై కోట్లకు పైనే ఖర్చుపెట్టారు.

ఇక అది వందకోట్లు వసూలు చేయాలని అనుకుంటే ఎలా.. భీమ్లా నాయక్ సినిమా మలయాళం లో నాలుగు కోట్ల సినిమా, కానీ ఇక్కడ బడ్జెట్ యాభై కోట్ల పై మాటే అలాప్రొడక్షన్ కాస్ట్ పెంచుకుంటూ పోతే బడ్జెట్ పెరగక ఏమవుతుంది. మళ్ళీ టికెట్ రేట్లు పెంచాలి అంటూ మాట్లాడారు. రేట్లు పెంచితే జనం సినిమా కోసం థియేటర్లకే రావడం లేదు. ఆ సినిమాలో ఎంత పెద్ద హీరో ఉన్నా చూడడానికి ఆసక్తి చూపడం లేదు. ఓటీటీ లో వచ్చాక చూద్దాంలే అనే అభిప్రయానికి వచ్చారు. కాబట్టి సమస్యకు పరిష్కారం సినిమా షూటింగులను ఆపేయడం కాదు, హీరోల రెమ్యూనరేషన్లు కాదు అంటూ ఆయన అభిప్రాయాన్ని పంచుకున్నారు తమ్మారెడ్డి.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago