Thammareddy Bharadwaja : సీనియర్ ప్రొడ్యూసర్, దర్శకుడు అయిన తమ్మారెడ్డి గారు సమాకాలిన అంశాల మీద మాట్లాడుతూ, సినిమా ఇండస్ట్రీ కి సంబంధించిన సమస్యల గురించి ఆయన అభిప్రాయాలను చెబుతూ ఉంటారు. ఇక ఇటీవల నెలకొన్న సినిమా సంక్షోభాల గురించి మాట్లాడుతూ పాన్ ఇండియా మోజులో పడి తెలుగు నేటివిటీని మర్చిపోయి సినిమాలు తీయకూడదు అంటూ చెప్పారు. ఇక కృష్ణ గారితో ‘పచ్చటి సంసారం’ సినిమా తీసి హిట్ ఇచ్చారు తమ్మారెడ్డి. ఇక ఆతరువాత ‘రౌడీ అన్నయ్య’ సినిమా తరువాత కృష్ణ గారితో గొడవ జరగడంతో మూడేళ్లు దాదాపు మాట్లాడలేదని చెప్పారు తమ్మారెడ్డి.
బాబు మోహన్, సిల్క్ స్మిత పాటే గొడవకు కారణం…
కృష్ణ గారితో పచ్చటి సంసారం లాంటి మంచి హిట్ సినిమా అందించాక మళ్ళీ రౌడీ అన్నయ్య అనే సినిమాను కృష్ణ గారితో తమ్మారెడ్డి గారు తీశారు. ఇక ఈ సినిమాలో క్లైమాక్స్ లో సిల్క్ స్మిత తో ఒక సాంగ్ ప్లాన్ చేసాము. అయితే ఆ సాంగ్ బాబు మోహన్ సిల్క్ స్మిత మీద తీయాలనీ నేను అనుకుంటే కృష్ణ గారు కాదు నాకు సిల్క్ స్మిత కాంబినేషన్ లో ఉండాలి అని వాదించారు. ఒక మాస్ ఇమేజ్ ఉన్న హీరో బాబు మోహన్ లాంటి వ్యక్తి ముందు డాన్స్ చేయడం ఏమిటి, నాలుగు కొట్టి ఇవ్వు అంటే ఇస్తాడు కదా దానికి కృష్ణ గారు డాన్స్ ఎందుకు అంటూ నేను ఆలోచించాను.
మా ఇద్దరిలో ఎవరూ కంప్రమైజ్ కాలేదు చివరికి రెండు కాంబినేషన్స్ లోనూ పాట చేసాము. అయితే ఈ విషయం కృష్ణ గారికి తెలియదు. సెన్సర్ అప్పుడు బాబు మోహన్ తో కూడా పాట తీశామని తెలిసి కృష్ణ గారు నన్ను కోపంగా చూసారు. ఇక అప్పటి నుండి దాదాపు మూడేళ్లు ఆయనతో మాటలు లేవు మళ్ళీ మేమే మాట్లాడుకున్నాం. ఇటీవల మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా కూడా మేమిద్దరం కలిసి చూసాము అంటూ అప్పటి గొడవ గురించి చెప్పారు. అయితే ఆ విషయంలో ఆయనే కరెస్ట్ అనిపిస్తుంది. అత్తారింటికి దారేది సినిమాలో బ్రహ్మానందం ముందు పవన్ డాన్స్ చేస్తూ పాట ఉంటుంది అది చూసాక కృష్ణ గారు చెప్పింది నిజమే అనిపించింది అంటూ అభిప్రాయపడ్డారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…