Featured

Thammareddy Bhardwaja : 100,1000 కోట్లు అన్నీ అపద్ధాలు… అసలు సినిమా తీయడానికి ఎంత ఖర్చు అవుతుందంటే : తమ్మారెడ్డి భరద్వాజ

Thammareddy Bhardwaja : సినిమా ఇండస్ట్రీకి కొత్త ఉత్సాహం నింపిన సినిమాలు బింబిసార, సీతారామం. ఈ రెండు సినిమాలు మళ్ళీ జనాలను థియేటర్లకు రప్పిస్తున్నాయి. కంటెంట్ బాగుంటే సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తారని ఈ సినిమాలు నిరూపించాయి. ఇక ఈ సినిమాలు తమ విజయంతో పెద్ద సినిమా డైరెక్టర్లకు కనువిప్పు కలిగించాయి. సినిమా బడ్జెట్ అదుపు లో పెట్టి సినిమా హిట్ చేయచ్చని నిరూపించాయి. ఇక ఈ సినిమాలా విజయం గురించి సీనియర్ డైరెక్టర్ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ కూడా స్పందించారు.

పెద్ద సినిమా అయినా, చిన్న సినిమా అయినా ఎంత బడ్జెట్ అవుతుందంటే…

సినిమా ప్రొడక్షన్ కాస్ట్ తగ్గితే బడ్జెట్ అదుపులో పెట్టుకుంటే సినిమాకు నష్టాలు తగ్గుతాయి. నిర్మాత ప్రొడక్షన్ కాస్ట్ ను తగ్గించుకునేలా చూడాలి. హీరోల, డైరెక్టర్ల రెమ్యూనరేషన్లే కోట్లలో ఉంటే బడ్జెట్ కోట్లు దాటక ఏమవుతుంది అంటూ తమ్మారెడ్డి గారు కామెంట్స్ చేసారు. సినిమా షూటింగ్ ను ఉదయం ఆలస్యంగా మొదలు పెట్టి సాయంత్రం త్వరగా ముగిస్తే ఎన్ని రోజుల్లో సినిమా పూర్తవ్వాలి పాత రోజుల్లో ఉదయం ఏడు గంటలకంతా షూటింగ్ ప్రారంభించేవాళ్ళు కాబట్టి సమయం సరిపోయేది. ఇక సాయంత్రం అయితేనే పబ్ ల చుట్టూ తిరిగే ఆర్టిస్టులు ఉదయాన్నే షూటింగ్ రమ్మంటే రాలేరు కదా అలా వారిపై చేసిన ఆ ఖర్చంతా సినిమా తీసే ఖర్చుల్లో కలిపితే ఎలా. అసలు పెద్ద సినిమా అయినా చిన్న సినిమా అయినా బడ్జెట్ యాభై కోట్లకు మించి ఏమి ఉండదు.

వీళ్ళు విళాసాల కోసం పెట్టిన ఖర్చులను సినిమా బడ్జెట్ లో వేసుకుని మా బడ్జెట్ వందకోట్లు, వెయ్యి కోట్లు అంటూ డబ్బా కొడుతారు. అసలు ఖచ్చితంగా సినిమా తీయడానికి ఎంత ఖర్చయిందో చూస్తే యాభై కోట్లు మించదు అంటూ చెప్పారు. ఇక ఆచార్య లాంటి పెద్ద సినిమా ఎందుకు మొదటి రోజు కూడా వసూళ్లు రాలేదో ఇప్పటికీ ఇండస్ట్రీ లో ఎవరికీ అంతుచిక్కడం లేదని ఆయన పేర్కొన్నారు. ఇక థియేటర్ కి జనాలు రావడం లేదు అనుకున్న తరుణంలో విడుదల అయిన బింబిసార, సీతా రామం సినిమాలు మంచి కలెక్షన్స్ అందుకున్నాయి. బింబిసార సినిమా మొదటి రోజునుండే మంచి కలెక్షన్స్ వచ్చాయి. ఇక సీతారామం సినిమా నిదానంగా వసూళ్లలో పుంజుకుంది. కంటెంట్ బావుంటే సినిమా ను థియేటర్లో చూడడానికి ప్రేకక్షకులు ఇష్టపడుతారు అంటూ తమ్మారెడ్డి చెప్పారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago