Anchor Anasuya: బుల్లితెర ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అనసూయ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈమె జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్నారు.ఇక ఈ కార్యక్రమం ద్వారా వచ్చిన గుర్తింపుతో ఈమె ఏకంగా సినిమా అవకాశాలను కూడా అందుకున్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఈమె జబర్దస్త్ కార్యక్రమం నుంచి తప్పకున్న విషయం మనకు తెలిసిందే.
ఇక అనసూయకు సినిమా అవకాశాలు రావటం వల్లే తను జబర్దస్త్ కార్యక్రమం నుంచి తప్పకుందనే వార్తలు వచ్చాయి.ఇలా అనసూయ జబర్దస్త్ నుంచి వెళ్లిపోవడం గురించి ఎన్నో వార్తలు రావడంతో ఎట్టకేలకు ఈమె ఈ వార్తలపై స్పందించారు.ఈ సందర్భంగా అనసూయ మాట్లాడుతూ తనకు సినిమా అవకాశాలు రావటం వల్ల తరచూ డేట్స్ అడ్జస్ట్ చేయమని అడగడానికి చాలా గిల్టీగా ఉందని నా ఒక్కదాని కోసం అందరూ వారి షెడ్యూల్ మార్చుకోవడానికి తనకు ఇష్టం లేదంటూ వెల్లడించారు.
ఇకపోతే ఈ కార్యక్రమానికి యాంకర్ గా తాను 9 సంవత్సరాల నుంచి పని చేస్తున్నానని అయితే తనకెప్పుడూ ఈ కార్యక్రమం బోర్ కొట్టలేదని తెలిపారు. అయితే కొన్ని సందర్భాలలో తాను చాలా ఇబ్బంది పడ్డానని,క్రియేటివ్ ఫీల్డ్ లో ఉన్నప్పుడు ఇలాంటివి సర్వసాధారణమని అనసూయ వెల్లడించారు.ఇకపోతే ఈ కార్యక్రమంలో భాగంగా తనపై ఎన్నో పంచులు వేసేవాళ్ళు అలాగే తన బాడీ షేమింగ్ గురించి కూడా మాట్లాడేవారు. ఆ సమయంలో నేను నచ్చని ఎక్స్ప్రెషన్స్ పెట్టిన అవి ప్రేక్షకుల వరకు చేరేవి కాదు.
ఇలా ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో ఇబ్బందులను కూడా ఎదుర్కొన్నానని,ఈ కార్యక్రమం నుంచి బయటకు రావడం కోసం తాను గత రెండు మూడు సంవత్సరాల నుంచి ప్రయత్నాలు చేస్తున్నానని అనసూయ వెల్లడించారు. ఇక నాగబాబు గారు రోజా గారు సుధీర్ అందరూ వెళ్లిపోయారని తాను వెళ్లిపోవడం లేదని, అలా వెళ్లిపోవడానికి నేనేం గొర్రెల మంద కాదంటూ అనసూయ తెలిపారు.ఈ కార్యక్రమం కోసం నేను జీతం తీసుకుంటున్నాను నా జీతానికి కావాల్సినంత పని నేను చేస్తున్నాను నావల్ల ఎక్కడ తప్పు జరిగింది నష్టం వచ్చిందని మాట ఇంతవరకు వినిపించలేదని ఈ సందర్భంగా అనసూయ తాను జబర్దస్త్ కార్యక్రమాన్ని విడిచి వెళ్లిపోవడానికి కారణం తెలిపారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…