Tag Archives: Sudhir

Hyper Aadi: సుడిగాలి సుదీర్ వల్ల మల్లెమాలకు పేరు రాలేదు… హైపర్ ఆది షాకింగ్ కామెంట్స్!

Hyper Aadi: బుల్లితెర కమెడియన్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వారిలో హైపర్ ఆది ఒకరు. ఈయన జబర్దస్త్ కార్యక్రమంతో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో కూడా పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. అయితే ప్రస్తుతం సినిమా అవకాశాలు రావడంతో జబర్దస్త్ కార్యక్రమానికి దూరమైనప్పటికీ శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో మాత్రం తన స్టైల్ లో ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.

ఈ కార్యక్రమాల ద్వారా సుడిగాలి సుదీర్ కూడా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే ఈయనకు కూడా సినిమా అవకాశాలు రావడంతో సుడిగాలి సుదీర్ సైతం ఈ కార్యక్రమాల నుంచి బయటకు వచ్చిన సంగతి మనకు తెలిసిందే. ఈ కార్యక్రమంలో సుధీర్ చేయకపోయినా సుదీర్ పై పంచులు వేస్తూ తరచూ సుడిగాలి సుదీర్ లో గుర్తు చేసుకుంటూ ఉంటారు.

ముఖ్యంగా హైపర్ ఆది శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో సుధీర్ పట్ల పంచు డైలాగులు వేయడమే కాకుండా సుదీర్ స్థానాన్ని ఆక్రమించుకున్నారని చెప్పాలి. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి హైపర్ ఆదికి ఒక ప్రశ్న ఎదురయింది.సుధీర్ తిరిగి మల్లె మాల వారి కార్యక్రమాలలోకి వస్తే ఆయన ప్లేస్ తిరిగి ఆయనకు ఇస్తారా అంటూ యాంకర్ ప్రశ్నించారు.

Hyper Aadi: మేం లేకపోతే సుదీర్ ఫేమస్ కారు…


ఈ ప్రశ్నకు ఆది సమాధానం చెబుతూ కేవలం సుధీర్ అనే వ్యక్తి వల్ల మల్లెమాలవారికి పేరు రాలేదు. మేమందరం సుధీర్ వెంట ఉంటూ ఆయనపై పంచ్ డైలాగులు వేయటం వల్ల సుదీర్ ఫేమస్ అయ్యారు. మేము లేకపోతే సుదీర్ అంత ఫేమస్ అయ్యే వారు కాదని హైపర్ ఆది చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. దీంతో సుడిగాలి సుదీర్ అభిమానులు మాత్రం హైపర్ ఆది పై కాస్త గుర్రుగా ఉన్నారు.

Getup Sreenu: చిక్కుల్లో పడ్డ గెటప్ శ్రీను… ఏమాత్రం సపోర్ట్ అందించని సుధీర్ రాంప్రసాద్.. అసలేమైందంటే?

Getup Sreenu: గెటప్ శ్రీను పరిచయం అవసరం లేని పేరు జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎన్నో రకాల గెటప్స్ వేసి ప్రేక్షకులను సందడి చేస్తున్నటువంటి ఈయన ప్రస్తుతం బుల్లితెరపై జబర్దస్త్ కార్యక్రమంలో సందడి చేస్తూనే మరోవైపు వెండితెరపై కూడా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇక బుల్లితెరపై గెటప్ శ్రీను ఆటో రాంప్రసాద్ సుడిగాలి సుదీర్ ఫ్రెండ్షిప్ ఎలాంటిదో అందరికీ తెలిసిందే.

ఇకపోతే తాజాగా గెటప్ శ్రీను చిక్కుల్లో పడగా తనకు మేమున్నామంటూ సుడిగాలి సుదీర్ ఆటో రాంప్రసాద్ ఏమాత్రం ముందుకు రాకపోవడంతో ఎంతోమంది నేటిజన్ లు ఈ విషయంపై స్పందిస్తూ అసలు మీరు నిజంగానే స్నేహితుల అంటూ పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. ఇంతకీ ఏం జరిగింది అనే విషయానికి వస్తే…

గత రెండు రోజుల క్రితం ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన హనుమాన్ టీజర్ విడుదల చేసిన విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమంలో భాగంగా గెటప్ శ్రీను మాట్లాడుతూ హీరో ప్రశాంత్ వర్మపై ప్రశంసల వర్షం కురిపించారు.ఈ క్రమంలోనే ప్రశాంత్ వర్మ తెలుగు చిత్ర పరిశ్రమకు మరో రాజమౌళి అంటూ గెటప్ శ్రీను చేసిన ఈ కామెంట్స్ తీవ్ర దుమారం రేపుతున్నాయి. తెలుగు చిత్ర పరిశ్రమలో రాజమౌళి మార్క్ ఏంటో అందరికీ తెలిసిందే. అలాంటిది ప్రశాంత్ వర్మను రాజమౌళితో పోల్చడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

Getup Sreenu: మీరు అసలు స్నేహితులేనా…

ఈ క్రమంలోనే ప్రశాంత్ వర్మ గొప్ప డైరెక్టర్ అయినప్పటికీ ఆయన రాజమౌళి అంతా గొప్ప డైరెక్టర్ ఏమి కాదు.
రాజమౌళితో ప్రశాంత్ వర్మను పోల్చకండి అంటూ నెటిజన్లు రాజమౌళి అభిమానులు గెటప్ శ్రీను పై నెగిటివ్ కామెంట్లు చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే మరికొందరు ఈ వివాదంలోకి ఆటో రాంప్రసాద్ సుడిగాలి సుదీర్ ని కూడా లాగుతున్నారు. ఇలా మీ ఫ్రెండ్ రాజమౌళి గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో పొరపాటున అన్నారు అని మీరు ఏ మాత్రం సపోర్ట్ ఇవ్వడం లేదు..మీరు అసలు స్నేహితులేనా అంటూ చాలామంది వీరిద్దరిని కూడా ఈ వివాదంలోకి లాగి ట్రోల్ చేస్తున్నారు.

Jabardasth Varsha: ఇమ్మానుయేల్ తో పెళ్లికి సిద్ధమైన వర్ష… కానీ ఈ కండిషన్లు తప్పనిసరి!

Jabardasth Varsha: జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంది ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ముఖ్యంగా కొన్ని జంటలు ఈ కార్యక్రమం ద్వారా బాగా ఫేమస్ అయ్యాయి. అలాంటి వారిలో సుధీర్ రష్మీ జంట ముందు వరుసలో ఉండగా ఆ తర్వాతి స్థానంలో వర్ష ఇమ్మానియేల్ జంట ఉందని చెప్పాలి.వీరిద్దరూ చూడటానికి బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో ఉన్నప్పటికీ ఈ జంటకు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది.

ఇక జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎన్నో స్కిట్ లలో కలిసి సందడి చేసిన వర్ష ఇమ్మానుయేల్ మధ్య ఏదో సంథింగ్ సంథింగ్ ఉందంటూ ప్రేక్షకులు భావిస్తున్నారు. అయితే ఈ విషయంపై ఇప్పటివరకు ఈ జంట క్లారిటీ ఇవ్వలేదు. ఇకపోతే ఈ కార్యక్రమం ద్వారా ఈ జంటకు ఎన్నో సార్లు వేదికపై పెళ్లి చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇదిలా ఉండగా తాజాగా ఎక్స్ట్రా జబర్దస్త్ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు.

ఈ ప్రోమోలో భాగంగా వర్ష ఇమ్మానుయేల్ తో పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చారు. ఈ క్రమంలోనే ఇమ్మానుయేల్ ను పెళ్లి చేసుకోవడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పినటువంటి వర్ష తనని పెళ్లి చేసుకోవాలంటే కొన్ని కండిషన్లను పాటించాలని వెల్లడించారు. ఇమ్మానుయేల్ పెళ్లి చేసుకోవాలంటే తనకు మంచి బ్యాక్ గ్రౌండ్ ఉండాలని కండిషన్ పెట్టారు.

Jabardasth Varsha: వర్ష ఇమ్మానియేల్ నిజంగానే పెళ్లి చేసుకోబోతున్నారా..

ఈ క్రమంలోనే తనను పెళ్లి చేసుకోవడానికి వర్ష ఒప్పుకున్న సంతోషంలో ఇమ్మానుయేల్ తనకు నాగార్జున, చిరంజీవి పవన్ కళ్యాణ్ వంటి వారందరూ తెలుసని బిల్డప్ ఇచ్చారు.అయితే వారి సమక్షంలోనే పెళ్లి జరగాలని చెప్పగా ఇమ్మానియేల్ వేదికపై ఈ హీరోలకు డూపులను తీసుకురాగా వీరు కూడా వేదికపై పెద్ద ఎత్తున డాన్సులు చేశారు.మొత్తానికి ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో వైరల్ అవుతుంది. అయితే నిజంగానే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారా లేదంటే ఎపిసోడ్ కోసమే ఇలా పర్ఫార్మన్స్ చేశారా అనేది తెలియాల్సి ఉంది.

Anchor Anasuya: జబర్దస్త్ లో వెకిలి చేష్టలు, బాడీ షేమింగ్ వల్ల చాలా ఇబ్బందులు పడ్డాను… బయటికి రావడం కోసం రెండేళ్లు ప్రయత్నించా.. : అనసూయ

Anchor Anasuya: బుల్లితెర ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అనసూయ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈమె జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్నారు.ఇక ఈ కార్యక్రమం ద్వారా వచ్చిన గుర్తింపుతో ఈమె ఏకంగా సినిమా అవకాశాలను కూడా అందుకున్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఈమె జబర్దస్త్ కార్యక్రమం నుంచి తప్పకున్న విషయం మనకు తెలిసిందే.

ఇక అనసూయకు సినిమా అవకాశాలు రావటం వల్లే తను జబర్దస్త్ కార్యక్రమం నుంచి తప్పకుందనే వార్తలు వచ్చాయి.ఇలా అనసూయ జబర్దస్త్ నుంచి వెళ్లిపోవడం గురించి ఎన్నో వార్తలు రావడంతో ఎట్టకేలకు ఈమె ఈ వార్తలపై స్పందించారు.ఈ సందర్భంగా అనసూయ మాట్లాడుతూ తనకు సినిమా అవకాశాలు రావటం వల్ల తరచూ డేట్స్ అడ్జస్ట్ చేయమని అడగడానికి చాలా గిల్టీగా ఉందని నా ఒక్కదాని కోసం అందరూ వారి షెడ్యూల్ మార్చుకోవడానికి తనకు ఇష్టం లేదంటూ వెల్లడించారు.

ఇకపోతే ఈ కార్యక్రమానికి యాంకర్ గా తాను 9 సంవత్సరాల నుంచి పని చేస్తున్నానని అయితే తనకెప్పుడూ ఈ కార్యక్రమం బోర్ కొట్టలేదని తెలిపారు. అయితే కొన్ని సందర్భాలలో తాను చాలా ఇబ్బంది పడ్డానని,క్రియేటివ్ ఫీల్డ్ లో ఉన్నప్పుడు ఇలాంటివి సర్వసాధారణమని అనసూయ వెల్లడించారు.ఇకపోతే ఈ కార్యక్రమంలో భాగంగా తనపై ఎన్నో పంచులు వేసేవాళ్ళు అలాగే తన బాడీ షేమింగ్ గురించి కూడా మాట్లాడేవారు. ఆ సమయంలో నేను నచ్చని ఎక్స్ప్రెషన్స్ పెట్టిన అవి ప్రేక్షకుల వరకు చేరేవి కాదు.

Anchor Anasuya: జబర్దస్త్ కు కావాల్సినంత పని చేశాను…

ఇలా ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో ఇబ్బందులను కూడా ఎదుర్కొన్నానని,ఈ కార్యక్రమం నుంచి బయటకు రావడం కోసం తాను గత రెండు మూడు సంవత్సరాల నుంచి ప్రయత్నాలు చేస్తున్నానని అనసూయ వెల్లడించారు. ఇక నాగబాబు గారు రోజా గారు సుధీర్ అందరూ వెళ్లిపోయారని తాను వెళ్లిపోవడం లేదని, అలా వెళ్లిపోవడానికి నేనేం గొర్రెల మంద కాదంటూ అనసూయ తెలిపారు.ఈ కార్యక్రమం కోసం నేను జీతం తీసుకుంటున్నాను నా జీతానికి కావాల్సినంత పని నేను చేస్తున్నాను నావల్ల ఎక్కడ తప్పు జరిగింది నష్టం వచ్చిందని మాట ఇంతవరకు వినిపించలేదని ఈ సందర్భంగా అనసూయ తాను జబర్దస్త్ కార్యక్రమాన్ని విడిచి వెళ్లిపోవడానికి కారణం తెలిపారు.

Pandugod Movie: హీరోయిన్ అయ్యాక కూడా నీ మొహమే చూడాలా.. సుధీర్ ను ఓ రేంజ్ లో ఆడుకున్న విష్ణు ప్రియ?

Pandugod Movie: బుల్లితెరపై పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేసిన సుడిగాలి సుదీర్ విష్ణు ప్రియ దీపిక పెళ్లి వంటి తదితరులకు రాఘవేంద్రరావు సమర్పణలో తెరకెక్కిన వాంటెడ్ పండు గాడ్ సినిమాలో హీరో హీరోయిన్లుగా అవకాశం కల్పించారు. ఈ సినిమాకు శ్రీధర్ సీపాన దర్శకత్వంలో వహించారు. ఇక ఈ సినిమాలో ఎంతోమంది కమెడియన్స్ సందడి చేయనున్నారు. సీనియర్ నటులు తనికెళ్ల భరణి, బ్రహ్మానందం, పృధ్విరాజ్ వంటి తదితరులు ఈ సినిమాలో నటించారు.

ఇకపోతే ఈ సినిమా ఆగస్టు 19వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడంతో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా సుధీర్ దీపిక పెళ్లి విష్ణుప్రియ వంటి తదితరులు ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఈ ఇంటర్వ్యూలో భాగంగా విష్ణు ప్రియ సుడిగాలి సుదీర్ పై తనదైన శైలిలో పంచ్ వేసింది.

బుల్లితెర కార్యక్రమాలలో మాత్రమే కాకుండా తాను హీరోయిన్ అయ్యాక కూడా నీ ఫేస్ చూడాలా అంటూ ఈమె సుదీర్ కు పంచ్ వేసింది.ఇక వీరిద్దరు కెరియర్ మొదట్లో పోవే పోరా అనే కార్యక్రమంలో యాంకర్లుగా వ్యవహరించిన విషయం మనకు తెలిసిందే.అయితే సుధీర్ పలు కార్యక్రమాలకు అవకాశాలు అందుకొని బుల్లితెరపై కొనసాగగా విష్ణు ప్రియ మాత్రం కాస్త బ్రేక్ ఇచ్చిందని చెప్పాలి.

Pandugod Movie: ఎంతో పుణ్యం చేసుకున్నాను…

చాలా రోజుల తర్వాత వీరిద్దరూ కలిసి ఈ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఇక ఈ సినిమాలో ఆరెంజ్ అనే ఒక పండు సినిమా మొత్తం కొనసాగుతుందని ఈ సినిమాలో నటించే అవకాశం వచ్చినందుకు తానే ఎంతో పుణ్యం చేసుకున్నానని విష్ణు ప్రియ తెలిపారు. ఇక విష్ణు ప్రియతో ఈ సినిమాలో నటించడం తనకు ఎంతో ఆనందంగా ఉందని ఈ సందర్భంగా సుధీర్ వెల్లడించారు.ఇలా వీరందరూ కలిసి ఈ ఇంటర్వ్యూ ద్వారా ఎన్నో ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.