Samantha: జీవితంలో అది చాలా ముఖ్యం.. కానీ ఎవరు చెప్పరు: సమంత ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Samantha: నాగచైతన్య- సమంతలు విడాకులు తీసుకున్న తర్వాత నుంచి ఇటు సమంత, అటు నాగచైతన్య సినిమాల్లో బిజీ అయ్యారు. వీరిద్దరు విడాకులు తీసుకోవడం ఇండస్ట్రీలో చర్చనీయాంశం అయింది. ఇప్పటికీ కూడా వీరెందుకు విడాకులు తీసుకున్నారనే విషయం వారి అభిమానులకు తెలయడం లేదు. విడాకులు తీసుకున్న కొంత కాలం వరకు చాలా సమంత చాలా డిప్రెషన్లకు వెళ్లిన సంగతి తెలిసిందే.
ఆమెపై విపరీతంగా ట్రోలింగ్, కామెంట్లు చేశారు నెటిజెన్లు. ఈ విషయంపై కొన్ని వెబ్ సైట్లు, యూట్యూబ్ ఛానెళ్లపై పరువు నష్టందావా కూడా వేసింది. ఒకానొక సమయంలో సూసైడ్ ఆలోచనలు కూడా వచ్చాయని గతంలో తెలిపింది.
ఇదిలా ఉంటే సమంత మరింత స్ట్రాంగ్ అయింది. తన అభిమానులతో సోషల్ మీడియాలో అందుబాటులో ఉంటుంది. ఇన్ స్టాలో తన అభిప్రాయాలను నిక్కచ్చిగా వెల్లడిస్తోంది. తాజా ఇన్ స్టాలో ఒక స్టేటస్ పెట్టింది. ప్రస్తుతం ఆ స్టేటస్ నెటిజన్లనను తెగ ఆకట్టుకుంటోంది.
క్రమశిక్షణ గురించి ఆపోస్ట్ లో వివరించింది. ‘‘ క్రమశిక్షణ ఎందుకు అంత ముఖ్యమైనదో ఎవరూ మీకు చెప్పనక్కర్లేదు. క్రమశిక్షణ మనపై మనకు ఉన్న ప్రేమకు బలమైన రూపం అని.. రాబోయే గొప్ప బహుమతుల కోసం ప్రస్తుత ఆనందాలను విస్మరిస్తుందని.. మీరు కోరుకున్నవన్నీ మీకు ఇచ్చేంతగా మిమ్మల్ని ప్రేమించడండి’’ అంటూ స్టేటస్ పెట్టింది. విడాకుల అనంతరం నుంచి సమంత సినిమాల జోరు పెంచింది. ఇప్పటికే తను చేసిన పుష్ప సినిమాలోని ఐటెం సాంగ్ ‘‘ ఊ అంటావా మావా..ఊఊ అంటావ’’ పాట పెద్ద హిట్ అయింది. గుణ శేఖర్ దర్శకత్వంలో ప్యాన్ ఇండియా సినిమాగా ‘ శాకుంతలం’ రూపొందుతుంది. దీంతో పాటు తెలుగు, తమిళ భాషల్లో ‘యశోద’ సినిమా చేస్తోంది. మరికొన్ని ప్రాజెక్ట్ లను కూడా త్వరలోనే పట్టాలెక్కించబోతోంది.
పేగుల్లో ఉండే మంచి బ్యాక్టీరియా (గట్ మైక్రోబయోమ్) ఆరోగ్యంపై చూపే ప్రభావం గురించి ఇప్పటివరకు ఎక్కువగా జీర్ణవ్యవస్థ కోణంలోనే చర్చించేవారు.…
శ్రీకాళహస్తి దేవస్థానంలో రాహు-కేతు పూజల టికెట్ ధరల పెంపుపై చెలరేగిన వివాదానికి చివరకు ముగింపు పడింది. భక్తుల నుంచి వచ్చిన…
తెలుగు సినీ పరిశ్రమలో ఒకప్పుడు హీరోయిన్‌గా మంచి గుర్తింపు పొందిన ఆమని ఇప్పటికీ అదే ఉత్సాహంతో, ఆరోగ్యంతో కనిపించడం చాలా…
కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లాలో చోటుచేసుకున్న ఒక దారుణ ఘటన కుటుంబాల్లో పెరుగుతున్న అసహనం ఎంత ప్రమాదకరంగా మారుతుందో మరోసారి…
సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ తన కొత్త పాడ్‌కాస్ట్‌లో మరోసారి తనదైన స్టైల్‌లో ఆలోచింపజేసే విషయాలను ప్రస్తావించారు. ‘సైన్స్ అండ్…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్‌లోనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ లగ్జరీకి ప్రాధాన్యత ఇస్తున్నట్లు మరోసారి రుజువైంది. ఇప్పటికే…