Tabu: 90 సంవత్సరాలాలో ఇండస్ట్రీలో అగ్ర తారలుగా కొనసాగుతున్న వారిలో నటి టబు ఒకరు. ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర హీరోల సరసన నటించి మంచి గుర్తింపు పొందారు.నార్త్ సౌత్ అనే తేడా లేకుండా ఈమె బాలీవుడ్ ఇండస్ట్రీలో సైతం అగ్రహీరోల సరసన నటించి నటిగా గుర్తింపు పొందారు.అయితే గత కొంత కాలం నుంచి తెలుగు చిత్ర పరిశ్రమకు దూరమైన టబు అలా వైకుంఠపురం సినిమా ద్వారా తిరిగి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. ఇలా పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తున్న టబు ఐదు పదుల వయస్సు వచ్చినప్పటికీ ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా ఉన్నారు.
ఈ విధంగా ఈమె ఇండస్ట్రీలో పెళ్లి చేసుకోకుండా ఉండడానికి కారణం చిత్ర పరిశ్రమకు చెందిన ఒక హీరోతో ఈమెకు ఎఫైర్ ఉండటం వల్ల పెళ్లి చేసుకోకుండా అలాగే ఉన్నారనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.ఈ విషయం గురించి ఎన్నో సార్లు మీడియా తన ప్రశ్నించిన ప్రశ్నను దాట వేసేవారు. తాజాగా ఈ విషయంపై స్పందించి తాను ఇప్పటివరకు పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఏంటో తెలియజేశారు.
నేను యుక్త వయసులో ఉన్నప్పుడు నా కజిన్ బ్రదర్ సమీర్ ఆర్యా ఇంటి పక్కనే బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ ఉండేవాడు. వీరిద్దరూ ఎల్లప్పుడు నాపై ఎంతో నిగా పెట్టేవారు.నాతో ఎవరైనా అబ్బాయిలు మాట్లాడటానికి ప్రయత్నం చేసిన వీరిద్దరూ వాళ్ళని తిట్టేవాళ్ళు కొట్టేవాళ్ళు. నేను ఇప్పుడు ఒంటరిగా ఉన్నాను అంటే అందుకు కారణం అజయ్ దేవగన్.ఆయన కారణంగా ఇప్పటికీ నేను ఒంటరిగా ఉన్నాను దానికి అజయ్ పశ్చాత్తాపడుతూ ఉంటాడు అని కూడా నేను భావిస్తున్నాను అంటూ సరదాగా సమాధానం చెప్పారు.
ఈమె 1991లో కూలి నెంబర్ వన్ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యారు. హీరోయిన్ గా ఈమె మొదటి చిత్రం ఇదే తెలుగుతో పాటు తమిళ, మలయాళం ఇంగ్లీష్ బెంగాల్ మరాఠీ భాషలో కూడా ఈమె ఎన్నో సినిమాలలో నటించారు. ఇక చిన్నప్పటి నుంచి తను నాకు మంచి ఫ్రెండ్ అని తను తనకు ఒక మంచి ప్రొటెక్టర్ గా ఉన్నారని, ఇలా నాపై చాలా శ్రద్ధ చూపుతూ ఎవరు నాతో మాట్లాడకుండా చేసేవాళ్లు అందువల్లే వల్లే నాకు పెళ్లి కాలేదు అంటూ ఈమె సరదాగా తను పెళ్లి చేసుకోకుండా ఉండడానికి కారణం తెలిపారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…