RGV: ఇప్పుడిప్పుడే సాయి పల్లవి ఇష్యూ ని అందరూ మర్చిపోతున్నారు. విరాట పర్వం సినిమా ప్రచారంలో భాగంగా పలు ఇంటర్వ్యూల్లో మాట్లాడిన సాయి పల్లవి వివాదాస్పద వాఖ్యలు చేయడం తెలిసిందే. కాశ్మీరి పండితులను చంపడం, ముస్లిం వ్యక్తిని గో రక్షకుల పేరుతో చంపడం రెండు ఒకటే అన్నట్లుగా మాట్లాడంతో దుమారం రేగింది. హిందూ సంస్థలైన భజరంగ్ దళ్ వంటి సంస్థలు కేసులు పెట్టడం, ఆ తరువాత సాయి పల్లవి సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు చెప్పి వివరణ కూడా ఇచ్చింది.
తెలిసీ తెలియక మాట్లాడితే ఆ రచ్చేంట్రా బాబు…
ఇక తాజాగా ఈ విషయంపై ఆర్జీవి స్పందించారు. ఒక రాజకీయనాయకుడు, ఎమ్మెల్యే, ఎంపీ ఆఖరికి ఒక పార్టీ కార్యకర్త ఇలాంటి వాఖ్యలు మాట్లాడితే అపుడు ఆ విషయం గురించి మాట్లాడాలి కానీ ఒక సినిమా హీరోయిన్ అందునా చిన్న వయసు గల అమ్మాయి తెలిసీ తెలియక మాట్లాడితే దానిపై రచ్చచేయడమేంటి అంటూ స్పందించారు. ఒక సెలబ్రిటీ ఏదో తెలియక మాట్లాడినంత మాత్రాన ఏం అవుతుంది, ఆవిడ ఏమైనా ఎమ్మెల్యే నా ఎంపీ నా అన్నట్లు ఆయన స్పందించారు. ఇక కొండా సినిమా ప్రచారం కార్యక్రమాల్లో పాల్గొంటున్న ఆయన సినిమా విషయంలో కాంప్రమైజ్ కాలేదని చెప్పారు. ఇక సీఎం కెసిఆర్ మీద సినిమా ఖచ్చితంగా తీస్తానని చెప్పారు.
కొండా సినిమా ముందు వరకు కూడా మురళీ, కొండా సురేఖ అసలు తెలియదని 2014 ఎలక్షన్ సమయంలో కొండా సురేఖ వీడియోల ద్వారా తెలుసు, అయితే కొండా సురేఖ భర్త కొండా మురళీ అనే విషయం తెలియదని, వాళ్ళ కథ తెలుసుకున్నాక సినిమా తీయాలని అనుకున్నా. ఇక వారి కూతురు సుస్మిత పటేల్ నిర్మాతగా ఉంటానని చెప్పారు. అలా ఆ కథ సినిమా అయిందని వివరించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…