General News

హృదయాన్ని కలచివేస్తున్న ఘటన.. తల్లి శవం పక్కన కూర్చున ఆ చిన్నారి రోధనలు మిన్నంటాయి..

Content: కొన్ని ఘటనలు చూస్తుంటే హృదయాన్ని కలచి వేస్తాయి. దేవుడు ఇంత అన్యాయం చేశాడేంట్రా అని అనుకుంటాం. కరోనా మహమ్మారి కాలంలో ఇలాంటి ఘటనలు చూస్తూ వచ్చాం. తాజాగా జరిగిన ఓ ఘటన చూసిన ప్రతీ ఒక్కరూ కన్నీళ్లు పెట్టుకున్నారు.

ఈ ఘటన నిర్మల్ జిల్లాలో చోటు చేసకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ముధోల్ మండలంలోని ఎడ్‌బిడ్ గ్రామానికి చెందిన రోషిని అనే మహిళ అనారోగ్యంతో మృతి చెందింది. కొన్ని రోజుల క్రితం అతడి భర్త మరణించాడు. వాళ్లకు ఐదు సంవత్సరాల చిన్నారి కూడా ఉంది. ఈ విషాద ఘటనతో ఆ బాలిక అనాథగా మారిపోయింది.

తల్లి శవం పక్కన కూర్చున్న ఆ చిన్నారి రోధనలు మిన్నంటాయి. తల్లి మృతదేహం పక్కన అమాయకంగా కూర్చున్న చిన్నారిని చూసి గ్రామస్తులందరూ కంటనీరు తెచ్చుకుంటున్నారు. కనీసం అంత్యక్రియలు చేయడానికి కూడా డబ్బలు లేని నిస్సాయస్థితిలో ఉన్న ఆ బాలికను చూసిన కొందరు కరిగిపోయారు. స్థానికులు తలో చేయి వేసుకొని.. అంత్యక్రియలకు సాయం చేశారు.

అంతే కాకుండా.. వాట్సాప్ గ్రూప్ లో ఈ విషయాన్ని షేర్ కూడా చేశారు. దీనికి భైంసా సేవా టీమ్ సభ్యులు స్పందించి దాదాపు రూ.95 వేలు ఆర్థిక సహాయాన్ని అందించారు. వాళ్ల పేరు తరఫున గూగుల్ పే చేశారు. దీంతో ఆ టీమ్ సభ్యులను గ్రామస్తులు అభినందించారు. వచ్చిన డబ్బులతో ఆమె అంత్యక్రియలను నిర్వహించారు స్థానికులు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

మరిన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు..మూడు రోజుల పాటు వర్షాల హెచ్చరిక.!

ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…

2 days ago

విజయ్-సంగీత కలిసి ఉంటున్నారా? కోలీవుడ్‌లో కొత్త చర్చ..

తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…

2 days ago

ఒకడే కాదు.. తమ్ముడు కూడా టాప్ క్లాస్! సూర్యవంశీ కుటుంబంలో మరో క్రికెట్ స్టార్..

భారత క్రికెట్‌లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…

2 days ago

రూ.30 వేల అప్పు కోసం దారుణం.. స్నేహితుడినే హత్య చేసిన ఇద్దరు యువకులు..

నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…

2 days ago

ఎలాన్ మస్క్ సంపద ఎంత తెలుసా?.. ప్రపంచ జనాభాకు పంచితే ఒక్కొక్కరికి ఎంత వస్తుంది?ఆశ్చర్యపరిచే లెక్కలు ఇవే!

ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…

2 days ago

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు షాక్..జరిమానా విధించిన న్యాయస్థానం..

హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…

2 days ago