Featured

‘1997’ అందరూ చూడాల్సిన సినిమా.. ప్రకాష్ రాజ్!

డైరెక్టర్ డాక్టర్ మోహన్ దర్శకత్వంలో త్వరలో విడుదల కానున్న సినిమా 1997. ఈ సినిమాలో డా. మోహన్, నవీన్ చంద్ర, శ్రీకాంత్ అయ్యంగార్, కోటి, బెనర్జీ, రవి ప్రకాష్, రామరాజు తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమా ఈశ్వర పార్వతి మూవీస్ బ్యానర్ పై రూపొందుతుంది. ఈ సినిమాకు నందమూరి హరి ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు. ఇక కోటి ఈ సినిమాకు తన సంగీతాన్ని అందిస్తున్నాడు. మీనాక్షి రమావత్ ఈ సినిమాకు నిర్మాతగా బాధ్యతలు చేపట్టారు.

ఇక ఈ సినిమా రియల్ ఇన్సిడెంట్ నేపథ్యంలో తెరకెక్కనుంది. అంతేకాకుండా భిన్నమైన కథతో ఈ సినిమా రూపొందుతుంది. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ కూడా విడుదలవ్వగా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అంతేకాకుండా మోహన్, నవీన్ చంద్ర, శ్రీకాంత్ అయ్యంగార్ లుక్స్ కూడా బాగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమాలో సింగర్ మంగ్లీ పాడిన మొదటి పాట కూడా విడుదలైంది. ఈ పాటకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ పాట గురించి ప్రకాష్ రాజ్ కూడా అభినందించాడు.

ఈ నేపథ్యంలో కొన్ని విషయాలు కూడా పంచుకున్నాడు. మోహన్ దర్శకత్వంలో రూపొందుతున్న 1997 సినిమాలో పాట విన్నాను అంటూ అంతే కాకుండా కథ గురించి తెలుసుకున్నానని తెలిపాడు. ఈ రోజుల్లో కూడా అందర్నీ బాధపడుతున్న సమస్యల గురించి సినిమా తీశారని ప్రతి ఒక్కరు ఈ సినిమాను తప్పకుండా చూడాలని కోరాడు. ఇటువంటి అద్భుతమైన కథను రూపొందిస్తున్నందుకు ఈ సినిమా బృందానికి కృతజ్ఞతలు తెలిపాడు. పైగా ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవాలని కోరాడు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago