‘రాధే శ్యామ్’ సినిమాపై అంచనాలు తారుమారవుతున్నాయా …? ప్రస్తుతం నెటిజన్స్‌లో గానీ ఫిలిం సర్కిల్స్‌లో గానీ ఇదే టాక్ వినిపిస్తోంది. ప్రభాస్ ఇప్పటి వరకు చేయని లవ్ స్టోరీ అంటూ చిత్రబృందం ముందు జనాలను ఊదరగొడుతూ వస్తోంది. దాంతో ప్రభాస్ ఫ్యాన్స్‌లో మాత్రమే కాకుండా అందరిలోనూ ఈ సినిమా మీద అంచనాలు భారీ స్థాయిలో పెరిగాయి. బాహుబలి సినిమా తర్వాత పాన్ ఇండియన్ స్టార్‌గా మారిన ప్రభాస్‌కు ఆ తర్వాత చేసిన సాహో సినిమా తోనూ బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఏర్పడింది.
దానికి ఉదాహరణ సాహో సినిమానే. ప్రపంచవ్యాప్తంగా రిలీజైన ఈ సినిమా సౌత్‌లో నష్ఠాలను మూటగట్టుకుంది. కానీ, ఒక్క బాలీవుడ్‌లో మాత్రం 150 కోట్లకు పైగానే రాబట్టిందని వార్తలు వచ్చాయి. ఆ రకంగా ప్రభాస్‌కు బాలీవుడ్‌లో ఉన్న మార్కెట్ రేంజ్ ఏంటో అందరికీ అర్థమైంది. అందుకే సాహో తర్వాత మేకర్స్ ఏ సినిమా ప్లాన్ చేసిన ప్రభాస్‌తో పాన్ ఇండియన్, పాన్ వరల్డ్ రేంజ్‌లోనే చేశారు. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న అన్నీ సినిమాల మీద అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి.
ముఖ్యంగా రాధే శ్యామ్ సినిమా మీద అందరి చూపు ఉంది. ఎన్.టి.ఆర్, రాం చరణ్ లాంటి స్టార్‌తో రాజమౌళి ఫిక్షనల్ డ్రామాగా ఆర్ఆర్ఆర్ అనే పాన్ ఇండియన్ సినిమాను
సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నా కూడా రాధే శ్యామ్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. అయితే ఎప్పటికప్పుడు ఈ సినిమా విషయంలో మేకర్స్ అభిమానులనే కాదు అందరినీ బాగా డిసప్పాయింట్ చేస్తున్నారు. ఫస్ట్ మోషన్ పోస్టర్ రిలీజ్ చేసినప్పుడే చాలా వరకు నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. టీజర్ మొత్తం యానిమేషన్‌లో ఉందని ఫ్యాన్సే కామెంట్ చేశారు.
పోస్టర్స్‌తో కొంతవరకు శాటిసిఫై చేసినా మళ్ళీ తాజాగా వచ్చిన ఈ రాతలే అనే సాంగ్‌తో తీవ్రంగా డిసప్పాయింట్ చేశారు. ఫస్ట్ సింగిల్ వస్తుందని మేకర్స్ ప్రకటించగానే అందరూ చాలా ఊహించుకున్నారు. అయితే చెప్పిన సమయానికి సాంగ్ రిలీజ్ చేయకుండా జనాలకు విసుగు కోపం తెప్పించారు. గంటలకొద్దీ ఆలస్యం అయిన కూడా సాంగ్ వచ్చి అందరికీ ఉత్సాహానిస్తుందనుకుంటే ఊహించని విధంగా షాకిచ్చారు. ఈ సాంగ్ కూడా యానిమేషన్‌లో ఉండటం ప్రభాస్ అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. నచ్చలేదనే ఫీడ్ బ్యాక్ ఎక్కువగా వస్తోంది.
ఇక కొందరు అభిమానులైతే నిర్మాతల మీద కేసు పెట్టమని పోలీసులను ఆశ్రయిస్తూ ట్వీట్ చేస్తున్నారు. మోషన్ పోస్టర్ నుంచి, ఇటీవల వచ్చిన ఈ రాతలే సాంగ్ వరకు పెద్దగా జనాలను ఆకట్టుకుంది అంటూ ఏదీ లేదనే మాట వినిపిస్తోంది. సినిమా కూడా ఎక్కువగా యానిమేషన్‌లోనే ఉంటుందా ..! అనే సందేహాలు కలుగుతున్నాయి. ఇక మ్యూజిక్ పరంగా కూడా అంతగా ఆకట్టుకోవడం లేదు. అందుకు ఉదాహరణ తాజాగా విడుదలైన సాంగ్ వింటే అర్థమవుతుంది. మరి రాధే శ్యామ్ మీద ఉన్న అంచనాలు సినిమా రిలీజ్ అయ్యాక ఏమవుతాయో చూడాలి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…