బిగ్ బాస్ హౌస్ లో ఇంటి సభ్యుల మధ్య బాండింగ్ మరింత బలపడిపోతోంది. చిన్న విషయాలకు కూడా ఒకరిపై ఒకరు అలుగుతూ.. మాట్లాడుకోకపోవడం.. కన్నీళ్లు పెట్టుకుంటే.. ఒకరిని ఒకరు ఓదార్చుకోవడం జరుగుతోంది. నిన్న జరిగిన ఎపిసోడ్ లో అయితే షణ్ముఖ్, సిరిమధ్య చిన్న పాటి మనస్పర్థలతో సిరి అయితే వెక్కి వెక్కి ఏడ్చింది.
అసలేం జరిగిందంటే.. సిరి, షణ్ముఖ్ మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. షణ్ముక్ దగ్గరకు రాగానే.. నిన్ను చూస్తే చిరకాకుగా ఉంది.. ఇక్కడ నుంచి వెళ్లిపో అంటూ గట్టిగానే చెబుతుంది. అతడు అలానే అక్కడ నుంచి వెళ్లిపోతాడు. తర్వాత సన్నీ నామినేషన్స్ కు సంబంధించి ఇమిటేట్ చేస్తే సిరి నవ్వుతుంది.
తర్వాత కొద్ది సమయానికి షణ్ముఖ్ అక్కడ జరిగిన సంభాషణకు బాగా ఫీల్ అయినట్లు కనిపించింది. నాకు దీప్తి గుర్తుకువస్తుంది.. నీతో ఇక మాట్లాడను ఇక్కడ నుంచి వెళ్లిపో అని షణ్ముక్ అంటాడు. ఆ మాటలకు సిరి బాగా బాధపడుతుంది. వీళ్లిద్దరి మధ్య గొడవలు, మాట్లాడుకోక పోవడం అన్నీ కామనే.. అయినా మళ్లీ కలుసుకుంటారు.
కానీఈ సారి సిరి చాలా సీరియస్ గా తీసుకున్నట్లుంది. బాత్రూమ్ వెళ్లి.. తలను గోడకు కొట్టుకున్నట్లు కనిపించింది. బాత్రూమ్ నుంచి ఇంకా బయటకు రాకపోవడంతో రవి వచ్చి సిరి బయటకు రా.. అంటూ అంటాడు.. అయినా రాకపోవడంతో అందరూ అక్కడకు చేరుకొని గట్టిగా అరవడంతో బటయకు వచ్చేస్తుంది. తర్వాత సిరిని షణ్ముఖ్ ఓదార్చుతాడు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…