మరికొన్ని గంటల్లో బిగ్ బాస్ 5 సీజన్ ముగియబోతోంది. ఇప్పటికే గ్రాండ్ ఫినాలేకు రంగం సిద్ధమైంది. అయితే టాప్ 5 కంటెస్టెంట్ల మధ్య పోటీ రసతవత్తరంగా ఉంది. ముఖ్యంగా సన్నీ, షణ్ముఖ్ మధ్యే పోటీ ఉంటుందని అంటున్నారు అభిమానులు. ఇదిలా ఉంటే .. బిగ్ బాస్ గురించి పలు ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి.
గెలుపు సంగతి అటుంచితే.. అందర్ని షాకింగ్ కు గురిచేస్తూ ఓ కంటెస్టెంట్ రూ. 25 లక్షలు తీసుకుని టైటిల్ రేస్ నుంచి తప్పుకున్నట్లు సమాచారం. గత సీజన్ లో కూడా ఇలాంటి సంఘటనే జరిగింది. గత సీజన్ లో అభిజిత్, అఖిత్, సోహైల్, అరియానా, హారికలు టాప్ 5 కంటెస్టెంట్లుగా పోటీలో ఉన్నారు. అయితే ఈ సీజన్ లో హరిక 5వస్థానంలో, 4వస్థానంలో అరియానా నిలిచారు. అభిజిత్, సోహైల్, అఖిల్ మధ్య పోటీ నెలకొంది. ఈ సమయంలోనే నాగార్జున ఎవరిపైనా నమ్మకం లేదో వారు రూ. 25 లక్షలు తీసుకుని బయటకు వచ్చేయచ్చు అని చెప్పారు.
దీంతో సోహైల్ ఈ డీల్ కు ఒప్పుకుని బయటకు వచ్చాడు. ఈ సీజన్ లో అభిజిత్ విన్నర్ గా నిలువగా… అఖిల్ రెండో స్థానంలో నిలిచాడు. అయితే ఈసారి కూడా ఇలాగే డీల్ కుదుర్చుకుని పోటీనుంచి తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈసారి నాగర్జున ఆఫర్ ను సింగర్ శ్రీరామ్ చంద్ర తీసుకున్నట్లు వినికిడి. సిరి, మానస్ 4,5 స్థానాలతో ఎలిమినేట్ కాగా… టైటిల్ కోసం సన్నీ, షణ్ముఖ్, శ్రీరామ్ పోటీపడ్డారట. కాగా ఇంకొన్ని గంటల్లో విన్నర్ ఎవరో తెలియబోతోంది. అయితే ఈసారి సన్నీ విన్నర్ గా నిలుస్తారంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
షణ్ముఖ్ రెండో స్థానంలో నిలిచారని తెలుస్తోంది. అయితే సిరి వ్యవహారంతో షన్నూ వెనకపడినట్లు ఆడియన్స్ అభిప్రాయం. ఇదిలా ఉంటే గ్రాండ్ ఫినాలేను గ్రాండ్ గా ప్లాన్ చేశారు. ఈకార్యక్రమానికి గెస్ట్ లుగా ట్రిపుల్ ఆర్ టీం రామ్ చరన్, అలియాభట్ రానున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ కూడా వస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు శ్యాం సింగరాయ్ టీం నాని, సాయిపల్లవి కూడా వస్తున్నారని తెలుస్తోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…