ప్యాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన పుష్ప సినిమా శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. క్రియేటివ్ డైరెక్టర్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో అందరిలోను అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా బన్నీ నటిస్తున్నతొలి పాన్ ఇండియా సినిమా కావడం.. బన్నీ ఊర మాస్ గెటప్ లో ఎర్ర చందనం స్మగ్లర్ గా నటిస్తుండటంతో సినిమా పై క్రేజీ బజ్ ఏర్పడింది.
అయితే ప్రస్తుతం విడుదలైన సినిమా మాత్రం అంతంత మాత్రంగానే ఉందంటూ.. అభిమానులు పెదవి విరుస్తున్నారు. అనుకున్నంతగా అంచనాలను అందుకోవడంతో విఫలమైందని..కేవలం యావరేజ్ టాక్ తెచ్చకుందని సగటు ప్రేక్షకుడు అంటున్నారు. ఇదిలా ఉంటే సినిమాలో అల్లు అర్జున్ పక్కనే ఉంటూ.. మచ్చా మచ్చా అని పిలచే క్యారెక్టర్ గురించి చర్చ మొదలైంది.
అసలెవరు అతను అని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అసలు ఈ క్యారెక్టర్ వేసింది ఎవరో ఓ సారి తెలుసుకుందాం. అల్లు అర్జున్ పక్కన కేశవ అనే పాత్రలో నటించిన ఆ వ్యక్తి అసలు పేరు జగదీష్ ప్రతాప్ బండారి.. పుష్పకి ముందు మల్లేశం, పలాస 1978 అనే చిత్రాలలో నటించినప్పటికీ ఈయనకి పెద్ద గుర్తింపు రాలేదు. తాజాగా సుకుమార్ డెరెక్షన్ లో తెరకెక్కిన పుష్ప సినిమాలో కనిపించడంతో ఒక్కసారిగా గుర్తింపు తెచ్చుకున్నారు.
అల్లు అర్జున్ పక్కనే ఉంటూ అనర్గళంగా చిత్తూర్ యాస మాట్లాడటంలో ఆయన కష్టాన్ని మనం గమనించాం. అయితే భాషపై ఉన్న పట్టు కారణంగానే అల్లు అర్జున్ తో ఎక్కువ సమయం స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. సినిమాలో పుష్ప క్యారెక్టర్ తరువాత ఎక్కవ ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో ఒకటి కేశవ క్యారెక్టర్. ఈ పాత్రకు ప్రతాప్ బండారి పూర్తి న్యాయం చేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…